తెలంగాణ

రైతులను లూఠీ చేస్తున్న దళారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: రైతులను దళారులు లూఠీ చేస్తున్నందున బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోయతున్నాయని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. కూరగాయల ధరలే కాకండా పప్పు ధాన్యాల ధరలు సైతం ఆకాశన్నంటుతున్నందున ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దళారులను నిరోధించేందుకు గాను ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. టమాట ధర రైతుకు చెల్లించేది రూ.20 కూడా లేదని, బయట ధర మాత్రం రూ.80కి తగ్గడం లేదని అన్నారు. రైతు ప్రభుత్వాలంటూ ఊదరగొడుతున్న కెసిఆర్, మోదీ ప్రభుత్వాలు ఇంతవరకు ఉపశమన చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటని అన్నారు. తక్షణమే స్పందించి దళారీ వ్యవస్థను నిరోధించాలని డిమాండ్ చేశారు.