తెలంగాణ

దత్తాత్రేయకు ప్రోటోకాల్ ఉల్లంఘన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: బోనాల పండగ సందర్భంగా సికింద్రాబాద్‌లోని మహంకాళి దేవస్థానానికి వెళ్లినపుడు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ కుటుంబానికి అవమానించే రీతిలో పోలీసులు వ్యవహరించారని, ప్రోటోకాల్ ఉల్లంఘించారని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు శాసనసభాపక్ష నేత జి కిషన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దత్తాత్రేయ సతీమణి నడవలేరని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని , అదే పోలీసులు ఇతరులను ఆలయ ద్వారం వరకూ ప్రోటోకాల్‌కు విరుద్ధంగా వారి వాహనాలను అనుమతించారని అన్నారు. స్థానిక డిసిపి సాక్షిగా ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని, అయినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని అన్నారు. మహంకాళి దేవాలయం ప్రాంగణం చిన్నదిగా ఉండటం, ఇరుకు సందుల కారణంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఇబ్బంది కలుగకూడదని వాహనాల రాకపోకలను రాంగోపాల్‌పేట పోలీసు స్టేషన్ సమీపంలో నిలిపివేసినట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తనతో పాటు ఎంపి కె కేశవరావు, మండలి చైర్మన్ స్వామిగౌడ్ సైతం చాలా దూరం నుండి నడిచే ఆలయానికి చేరుకున్నామని వివరించారు.