తెలంగాణ

చౌకదుకాణాల్లో సరకుల్లేక విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత నిత్యావసర సరకులకు సంబంధించి పేదప్రజలపై (దారిద్య్రరేఖకు దిగువ ఉన్న-బిపిఎల్) పిడుగుపడ్డది. గతంలో చౌకదుకాణాల్లో బియ్యంతో పాటు మరో తొమ్మిది సరకులు చౌకధరలకు అందించేవారు. ఒక్కో కుటుంబానికి రూపాయికే కిలో చొప్పున 20 కిలోల బియ్యంతో పాటు ఒక కిలో గోధుమ, ఒక కిలో గోధుమ పిండి, అరకిలో చక్కెర, కందిపప్పు కిలో, పామాయిల్ ఒక లీటర్, ఐయోడైజ్‌డ్ ఉప్పు కిలో, చింతపండు అరకిలో, మిరపపొడి 250 గ్రాములు, పసుపు 100 గ్రాములు ఇచ్చేవారు. ఈ తొమ్మిది వస్తువులను 185 రూపాయలకే ఇస్తూ, ప్రభుత్వం సుమారు 107 రూపాయలను ఒక కుటుంబంపై భరించేది. ఇప్పుడు చౌకదుకాణాల్లో బియ్యం ఒక్కటే ఇస్తున్నారు. మిగిలిన వస్తువులను ఇవ్వడం నిలిపివేశారు.
వీటిని ఎందుకు నిలిపివేశారంటూ పేదప్రజలు అడుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలు సాధారణ దుకాణాలకు వెళ్లి తమకు కావలసిన నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు ఎక్కుడ మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. రాష్ట్రంలో తెల్లరంగు రేషన్ కార్డులు 90 లక్షల వరకు ఉన్నాయి. వీరికి సబ్సిడీపై తొమ్మిది నిత్యావసర వస్తువులు ఇవ్వాలంటే ప్రస్తుత ధరల ప్రకారం ప్రభుత్వంపై దాదాపు 100 కోట్ల రూపాయల భారం పడవచ్చని అంచనా వేశారు.
దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పేదప్రజలు తమకు చౌకదుకాణాల ద్వారా నిత్యావసర సరకులు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బియ్యం కిలో ఒక రూపాయి చొప్పున ఇస్తున్నారు. ఒక వ్యక్తికి నెలకు ఐదు కిలోల చొప్పన ఆ కుటుంబంలో ఎంత మంది ఉంటే అందరికీ ఐదుకిలోల చొప్పున ఇస్తున్నారు. బియ్యం సరఫరా బయోమెట్రిక్ విధానంలో ఇస్తున్నారు. కుటుంబ సభ్యుడు ఒకరు రేషన్ దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్ మిషన్‌పై వేలి ముద్ర వేస్తేనే బియ్యం ఇచ్చేందుకు వీలవుతోంది. ఇది మంచి నిర్ణయమేనన్న అభిప్రాయం అందరిలో ఉంది.ఇలా ఉండగా తెల్లరంకు రేషన్ కార్డులు కలిగిన వారికి ఇంట్లో వంటగ్యాస్ సిలిండర్ ఉంటే ఒక లీటర్ కిరోసిన్, వంటగ్యాస్ సిలిండర్ లేకపోతే రెండులీటర్ల కిరోసిన్ ఇస్తున్నారు. పేదలకు బియ్యం, కిరోసిన్ మాత్రమే లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అత్యసవసర నిత్యావసర సరకులను ప్రభుత్వం ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వెల్లడవుతోంది.