తెలంగాణ

ఎత్తిపోతల ఆధునీకరణకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాలను ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. సోమవారం మంత్రి జూపల్లి నీటి పారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డితో కలిసి నీటి పారుదల శాఖ అధికారులతో కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాలపై సమీక్షించారు. చెర్లపాడు గోపులాపూర్ చిన్న మారూర్ మాధవస్వామి ఎత్తిపోతల పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. వీటిని స్వయంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. చెర్లపాటు ఎత్తిపోతల ద్వారా 750 ఎకరాలు, చిన్నమరూర్ కింద 10 వేల ఎకరాలు, గోపులాపూర్ కింద 1400 ఎకరాలు, మాధవస్వామి ఎత్తిపోతల ద్వారా 850 ఎకరాల ఆయకట్టు సాగు జరగాల్సి ఉందన్నారు. ఈ పథకాలన్నీ పూర్తి స్థాయిలో ఉపయోగపడడం లేదు కాబట్టి వీటిని ఆధునీకరించి ఆయకట్టు పూర్తిగా సాగు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఇప్పటికే మహబూబ్‌నగర్‌లో సాగు నీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అలాగే చిన్న నీటి వనరులను కూడా పూర్తి స్థాయిలో సద్వినియోగంలోకి తీసుకుని రావాలని మంత్రి జూపల్లి ఆదేశించారు