తెలంగాణ

మేధావులను అందించిన ఓయు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మేథావులను అందించిన ఘనత ఉస్మానియా యూనివర్శిటీదేనని ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్ రావు పేర్కొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం యుకె, యూరప్ ఆధ్వర్యంలో లండన్‌లోని చారిత్రాత్మక ఇండియన్ జింఖానా క్లబ్‌లో పూర్వ విద్యార్ధులు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాంచందర్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎన్‌సిఇఆర్‌టి సభ్యుడు ప్రొఫెసర్ పుట్టి మనోహర్, డాక్టర్ దాసోజు శ్రవణ్, భారతీయ రాయబారి విజయ్ వసంత్, లండన్ ఎంపి వీరేంద్ర శర్మ, బర్మింగం యూనివర్శిటీ ఛాన్సలర్ లార్డ్ కరణ్ బిల్‌మొరియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లార్డ్ బిల్‌మొరియా మాట్లాడుతూ మహాత్మాగాంధీ ప్రపంచానికే ఆదర్శనీయులని అనానరు. పురాతన విశ్వవిద్యాలయాలకు చిరునామా ఆక్స్‌ఫర్డు యూనివర్శిటీ అని, అయితే దానికంటే వందల ఏళ్ల ముందే నలందా, తక్షశిల ఉన్నాయని, వందేళ్ల ఉస్మానియా యూనివర్శిటీ నుండే తాను కూడా పట్ట్భద్రుడ్ని అయ్యానని అన్నారు. బ్రిటన్ ఇండియా దేశాల మధ్య విద్యాపరమైన అంశాల్లో పరస్పరం సహకరించుకోవల్సి ఉందని చెప్పారు. వీడియోకాన్ఫరెన్సింగ్ ద్వారా విసి ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం మాట్లాడుతూ ఉస్మానియా అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యులు కావాలని సూచించారు. ప్రొఫెసర్ మనోహర్ మాట్లాడుతూ ప్రభుత్వ సహకారం లేకుండానే హార్వర్డు వర్శిటీ అల్యుమ్ని సహకారంతో అభివృద్ధి సాధించిందని చెప్పారు.