తెలంగాణ

సిపిఐ, సిపిఎం కలిస్త్తే మంచి ఫలితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: సిపిఎం, సిపిఐ కలిసి పని చేస్తే భవిష్యత్‌లో మంచి ఫలితాలు ఉంటాయని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో వామపక్షాలు రెండూ కలిసి రానున్న నాలుగైదేళ్లు పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సోమవారం నాడిక్కడ ఆయన ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ 1964లో వామపక్షాల్లో చీలిక వచ్చిన పరిస్థితులు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరని అన్నారు. ఒకే రకమైన అంశాలపై రెండు పార్టీలు వేర్వేరుగా పని చేసే కన్నా కలిసి పని చేయడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని పేర్కొన్నారు. స్ధానిక అవసరాలకు అనుగుణంగా ఎక్కడిక్కడ సిపిఐ, సిపిఎం కలిసి పని చేస్తే ఇరువురు మరింత బలోపేతమవుతామని అన్నారు. అయితే రాత్రికి రాత్రే అంతా మార్పు వస్తుందని అనుకోవడం లేదని, తప్పకుండా క్రమేణా మార్పు వచ్చి మంచి ఫలితాలు వస్తాయని మాత్రం భావిస్తున్నట్లు చెప్పారు. 1964లో ఐక్య భారతీయ కమ్యూనిస్టు పార్టీలో అప్పట్లో తలెత్తిన పలు జాతీయ స్థాయి రాజకీయ అంశాలు, సిద్ధాంతపరమైన విభేధాల కారణంగా చీలిక సంభవించిందని సురవరం గుర్తు చేశారు. కాకపోతే ఇరుపార్టీలు ఐక్యంగా పని చేసేందుకు ఎలాంటి చర్చలు జరగలేదని, దీని వల్లే ఐక్యత అనేది కొలిక్కి రాలేదని పేర్కొన్నారు.