తెలంగాణ

హాస్టళ్ల నిర్మాణానికి 109 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: తెలంగాణలో కెజిబివి, మోడల్ స్కూళ్ల హాస్టళ్ల నిర్మాణానికి 109 కోట్ల రూపాయిలు మంజూరు చేసినట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. బాలికల హాస్టళ్ల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టిసారించామని, 61 కెజిబివి, రెండు మోడల్ స్కూళ్ల హాస్టల్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్టు ఆయన తెలిపారు. 95 శాతం కెజిబివిలకు, 100 శాతం మోడల్ స్కూళ్లకు పక్కా భవనాలను నిర్మిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 475 కస్తూరిబా గాంధీ మోడల్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 391 కెజిబివిలకు ఇప్పటికే పక్కా హాస్టల్ భవనాలున్నాయి. తాజాగా మరో 61 కెజిబివిలకు హాస్టల్ భవనాల కోసం నిధులు మంజూరు కావడంతో 475 కెజిబివిలలో 452 బాలికల విద్యాలయాలకు పక్కా హాస్టల్ భవనాలు నిర్మించినట్టవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లు ఉండగా మొదటి దశలో 192 మోడల్ స్కూళ్ల భవనాలకు నిధులు రాగా, వీటంలో 130 భవనాలు పూర్తయ్యాయి. 32 భవనాల నిర్మాణం కొనసాగుతోంది.
తాజాగా మరో రెండు మోడల్ స్కూళ్లకు పక్కా భవనాలు సమకూరనున్నాయి. విద్యార్థులకు ఉచితంగా యూనిఫారం, పుస్తకాలను ఇస్తోందని, వారి ఆరోగ్యం కోసం నెలకు నాలుగు సార్లు చికెన్, రెండుసార్లు మటన్, ప్రతిరోజు గుడ్డు, కూరగాయలు, ఆకుకూరలు, సన్నబియ్యంతో పౌష్టికాహారం అందిస్తున్నట్టు ఆయన వివరించారు.