తెలంగాణ

ఆధునిక పరిజ్ఞానం వినియోగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచాల్సి ఉందని భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర పేర్కొన్నారు. ‘పంటల అభివృద్ధికి ఆధునిక జన్యుప్రజనన వ్యూహాలు’ అంశంపై జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో సోమవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. 2050 వరకు దేశ జనాభాకు 375 నుండి 425 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు అవసరం అవుతాయని, ఈ మేరకు ఉత్పత్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే ఆహార ధాన్యాలు, గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, భవిష్యత్తులో ఈ పెరుగుదల కొనసాగేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాల్సి ఉందన్నారు.
రెండోప్రపంచ యుద్ధం తర్వాత ఆహార ధాన్యాలకు కొరత ఏర్పడిందని విశ్వవిద్యాలయం వైస్-్ఛన్సలర్ డాక్టర్ వి. ప్రవీణ్‌రావు గుర్తు చేశారు. మొదటి హరిత విప్లవం ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, ఇప్పుడు నాణ్యమైన, కల్తీలేని ఆహార ధాన్యాల ఉత్పత్తిపై శ్రద్ద తీసుకోవాల్సి ఉందన్నారు. పర్యావరణానికి హాని కలిగించని, ఆర్థికంగా భారం కాని విధంగా, సుస్థిర పద్ధతుల్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచాల్సి ఉందన్నారు. వాతావరణ మార్పులను, వరదలు, కరవులను, ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు తట్టుకునే విధంగా ఉండే పంటల విత్తనాలను రూపొందించాల్సి ఉందన్నారు.
సమావేవంలో పలు సిఫార్సులను పాలక మండలి సభ్యుడు డాక్టర్ ఈఎ సిద్ధిఖీ ప్రతిపాదించారు. ఈ కార్యక్రమంలో ప్లాంట్ బ్రీడింగ్ శాస్తవ్రేత్తలు, చైనాకు చెందిన ప్రముఖ వ్యవసాయ శాస్తవ్రేత్త డాక్టర్ జికాంగ్‌లీతో పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు, శాస్తవ్రేత్తలు పాల్గొన్నారు.

చిత్రం.. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన
సదస్సులో ప్రసంగిస్తున్న ఐసిఎఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర