తెలంగాణ

కొలిచిన వారందర్నీ చల్లంగా చూస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ బేగంపేట, జూలై 10: తననే నమ్ముకుని, కొలిచిన వారందర్నీ తాను చల్లంగా చూస్తానని అమ్మవారు ఆవహించిన అవివాహిత స్వర్ణలత తెలిపారు. సికిందరాబాద్ బోనాల ఉత్సవాల్లో భాగంగా రెండురోజైన సికిందరాబాద్ శ్రీ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి దేవాలయం ఆవరణలో ఆమె ఉదయం పదిన్నర గంటల సమయంలో ఆలయం ముందున్న మాతేంగేశ్వరి విగ్రహం ముందు, ఒంటి నిండా పసుపు పూసుకుని, నదుటిన ఎర్రటి కుంకుమ తిలకాన్ని ధరించి, చేత తంబూరా పట్టుకుని పచ్చికుండపై నిల్చుడి భవిష్యవాణి విన్పించారు. ఈ సందర్భంగా భక్తులు అగిన ప్రశ్నలకు స్వర్ణలత సమాధానాలు చెబుతూ కొలిచిన వారు కొంగు బంగారమవుతున్నానని, తనకు బాగామే పూజలు చేస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సారి కూడా వర్షాలు విస్తారంగా కురిసి, పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, భక్తులందర్నీ తాను సంతోషంగా ఉంచుతానని వెల్లడించారు. ఈ ఏడాది జాతర ఎలా జరిగింది? సంతృప్తి కలిగించిందా? అన్న ప్రశ్నకు అమ్మవారు సమాధానం చెబుతూ సంతోషమేరా బిడ్డా..కాన్నీ ఎన్ని సమర్పించినా, ఎంత ఘనంగా చేసినా తనకు రక్తం రుచి చూపించటం లేదు లేదని, భక్తులను ఎదురు ప్రశ్నించింది. ఇదిలా ఉండగా, అమ్మవారు ఆవహించిన కేవలం నిమిషం వ్యవధిలో ఆమె భవిష్యవాణి ఎలా ఉంటుందో చెబుతుండగా, కొందరు భక్తులు కలగజేసుకుని సమయాన్ని వృథా చేస్తూ రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు అడగటం పట్ల భక్తులు విస్మయాన్ని వ్యక్తం చేశారు.

చిత్రం.. బోనాల పండుగ సందర్భంగా సోమవారం సికిందరాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయంలో భవిష్యవాణి చెబుతున్న స్వర్ణలత