తెలంగాణ

హైదరాబాద్‌లో భారీగా గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: హైదరాబాద్‌లో టాస్క్ఫోర్స్ పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మీదుగా ముంబై తరలిస్తున్న ఇద్దరు ముఠా సభ్యులను డిఆర్‌ఐ (డైరెక్టర్ రెవెన్యూ అధికారులు) అదుపులోకి తీసుకున్నారు. లారీని సీజ్ చేసి 600కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి ఓ గంజాయి ముఠా ఆదివారం మిర్చి, ఉల్లి వంటి నిత్యావసర వస్తువుల లోడ్‌తో లారీ బయలుదేరింది. సోమవారం రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్‌బినగర్ వద్ద వాహన తనిఖీల్లో భాగంగా లారీని కూడా పోలీసులు తనిఖీ చేశారు. నిత్యావసర వస్తువులు తరలిస్తున్న లారీలో గంజాయి ప్యాకెట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఈ గంజాయిని ముంబైకి తరలిస్తున్నట్టు నిందితులు అంగీకరించారు. సుమారు 58 లక్షలు విలువచేసే నార్కొటిక్ డ్రగ్స్ రవాణా చేస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నట్టు టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. లారీని సీజ్ చేసుకున్న పోలీసులు మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను జుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. కాగా హైదరాబాద్ కేంద్రంగా సాగుతోన్న గంజాయి దందాపై డిఆర్‌వో, టాస్క్ఫోర్స్, ఎస్‌వోటి బృందాలు అడుగడుగునా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నాయి.