తెలంగాణ

తెలంగాణ వక్ఫ్‌బోర్డుకు హైకోర్టులో చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: హైదరాబాద్‌లో అన్వర్ ఉల్ ఉలూమ్ విద్యా సంస్ధలను నేరుగా తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు వీలుగా తెలంగాణ వక్ఫ్ బోర్డు జారీ చేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అన్వర్ ఉల్ ఉలూం కాలేజీ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శివశంకర్ విచారించిన తర్వాత ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఉదయం కొంత మంది అధికారులు తమ కాలేజీ ప్రాంగణంలోకి వచ్చి వక్ఫ్ సంస్ధకు చెందిన వారమని, కాలేజీని స్వాధీనం చేసుకుంటున్నట్లు, కాలేజీ మేనేజిమెంట్‌ను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం హైకోర్టు ఆరు వారాల పాటు వక్ఫ్ బోర్డు ఆదేశాలను సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ కేసులో అఫిడవిట్‌లను దాఖలుచేయాలని హైకోర్టు వక్ఫ్ బోర్డును ఆదేశించింది.