తెలంగాణ

విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ఏప్రిల్ 2: విద్యారంగ సమస్యలను టిఆర్‌ఎస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని, గత మూడేళ్ళుగా స్కాలర్‌షిప్, ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఎన్‌ఎస్‌యుఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్‌ఖాన్ విమర్శించారు. శనివారం మెదక్ జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ విద్యను పేద విద్యార్థులకు దూరం చేసే క్రమంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం కుట్రలకు తెరలేపుతుండగా, 22 మంది పేద విద్యార్థులు వివిధ కారణాలతో మృతి చెందినప్పటికీ యే ఒక్క కుటుంబాన్ని ఆదుకున్న పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన సిఎం కెసిఆర్ మాట మరిచా రని ఆరోపించారు.