తెలంగాణ

అంబేద్కర్ వర్ధంతి నాటికి స్మృతి వనం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఉప ముఖ్యమంత్రి , విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. 2018 డిసెంబర్ 6వ తేదీన అంబేద్కర్ వర్ధంతి నాటికి 125 అడుగుల విగ్రహ ఏర్పాటు, స్మృతివనం పూర్తి చేయాలని చెప్పారు. అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం ఏర్పాటుపై క్యాబినెట్ సబ్‌కమిటీ సభ్యులు, అధికారులు సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన సమావేశమయ్యారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహానికి సంబంధించి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన చేసి ఏడాది పూర్తయినా, ఇంకా విగ్రహ ఏర్పాటు , స్మృతివనానికి సంబంధించి పనులు వేగంగా జరగడం లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
విగ్రహ నమూనా, స్మృతివనం ఏర్పాటుకు సంబంధించి చైనా, అస్సాం పర్యటించి వచ్చి ఐదు నెలలు అవుతున్నా, విగ్రహ నమూనాను సిద్ధం చేయకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇది ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన వాగ్ధానం కావడంతో దీనిపై అధికారులు సీరియస్‌గా దృష్టి సారించాలని, అత్యంత ప్రాధాన్యతగా గుర్తించాలని చెప్పారు. పనులు ఆలస్యమైతే ఉపేక్షించేది లేదని కడియం శ్రీహరి అన్నారు.
ఈ నెలాఖరులోపు విగ్రహాన్ని ఏర్పాటు చేసే సంస్థను ఖరారు చేయాలని , ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. ఆగస్టు నాటికి డిపిఆర్‌లు సిద్ధం చేయాలని, సెప్టెంబర్ నాటికి వాటిని ఫైనల్ చేయాలని అన్నారు. అక్టోబర్‌లో గ్లోబల్ టెండర్లు పిలవాలని, నవంబర్ నెలాఖరు నాటికి టెండర్లను ఎంపిక చేయడం, ఒప్పందం కుదుర్చుకోవడం పూర్తి చేయాలని అన్నారు. టెండర్లు పూర్తయిన ఏడాదిలోపు పనులు పూర్తి చేసి ఎలాంటి పరిస్థితుల్లోనూ 2018 డిసెంబర్ 6వ తేదీ నాటికి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని అన్నారు. అంబేద్కర్ నమూనా విగ్రహాలు, స్మృతి వనం మోడల్ కట్టడాలను సచివాలయంలోని మూడో అంతస్తులో సమావేశ మందిరం వద్ద కమిటీ సభ్యుల కోసం ప్రదర్శించారు.