తెలంగాణ

3రోజుల్లో గ్రీన్ బ్రిగ్రేడ్‌ల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: హరితహారంలో ప్రజలు చురుగ్గా బ్యాస్వామ్యం అయ్యేలా గ్రీన్ బ్రిగ్రేడ్‌లు ఏర్పాటుకు విస్తృత చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం నుంచి హరితహారం ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ మంగళవారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌పి సింగ్ మాట్లాడుతూ విద్యార్థులు, మహిళలు, యువకులు, హరిత ప్రియులు, స్వచ్ఛంద సంస్ధల భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 15 కోట్ల రూపాయలతో హరిత మిత్ర అవార్డులు ప్రదానం చేయనున్నట్లు ఆయన చెప్పారు. హరితహారంలో ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాలకు అనుగుణంగా హాబిటేషన్, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో రాష్ట్రం అంతా వర్తించేలా గ్రీన్ బ్రిగేడ్‌లు ఏర్పాటు చేయాలని, ఈ ప్రక్రియ మూడు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో డివిజన్, కాలనీ, కమ్యూనిటీలు సమూహాలుగా పచ్చదనం కోసం పాటుపడేలా చూడాలని, స్వచ్చందంగా హరిత తెలంగాణ కోసం నేను సైతం అనే వారిని గుర్తించి ప్రోత్సహించాలని అన్నారు. గత హరితహారంలో ఉత్సాహంగా పాల్గొన్న వారితో పాటు మహిళలు, యువకులు, వాకర్స్ గ్రూప్స్, పారిశ్రామిక, కార్పోరేట్ బాడీలు, ప్రభుత్వ రంగ సంస్ధలు, స్వచ్చంద సంస్ధలను పాల్గొనేలా చూడాలన్నారు. హరితహారానికి ప్రజలే నాయకులుగా, తమ ప్రాంతాల్లో పచ్చదనం కాపాడుకునే ఉద్యమాన్ని సామాజిక బాధ్యతగా ముందుకు తీసుకుని వెళ్ళాలని కోరారు. రాష్ట్రంలో చైతన్యవంతంగా ఉండే రోటరీ క్లబ్‌లు, ఎన్‌సిసి క్యాడెట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్‌ఎస్‌ఎస్ గ్రూపులు, బార్ అసోసియేషన్లు, ఎన్జీవోలు, సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్‌లను భాగస్వామ్యులుగా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. హరితహారం నిరంతరం కొనసాగే కార్యక్రమం అని, అదే స్థాయిలో ప్రజలు పాల్గొనేలా ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ప్రచార కార్యక్రమాలతో అనునిత్యం అందరూ హరితహారంపై అవగాహన కలిగేలా చూడాలని, అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో పాల్గొనాలని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతీ వార్డు స్థాయిలో కార్పొరేషన్‌లలో ఉప వార్డు వరకూ హరిత సైన్యం ఏర్పాటు చేయాలన్నారు. హరితహారం కోసం మంచిగా పని చేసిన వ్యక్తులు, సంస్థలకు అవార్డులు, రివార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఎస్‌పి సింగ్ తెలిపారు.

చిత్రం.. మంగళవారం సచివాలయంనుంచి కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సిఎస్ ఎస్‌పిసింగ్