తెలంగాణ

పత్తి కొనుగోలుకు అదనంగా 66సిసిఐ కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: పత్తి కొనుగోలుకు అదనంగా 66 కేంద్రాలను ప్రారంభించేందుకు సిసిఐ సానుకూలంగా స్పందించిందని రాష్ట్ర మంత్రి టి. హరీశ్ రావు తెలిపారు. మంగళవారం సిసిఐ చైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్ చొక్క లింగం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మార్కెటింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సిసిఐ సిఎండి చొక్క లింగం పాల్గొన్నారు. తెలంగాణలో వరంగల్, ఆదిలాబాద్‌లలో సిసిఐ ప్రాంతీయ కార్యాలయాలు ఉండగా మహబూబ్‌నగర్‌లో సిసిఐ బ్రాంచ్ ఏర్పాటు చేసినందుకు మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది పత్తి దాదాపు 17 లక్షల 50 వేల హెక్టార్లలో పండించి ఉత్పత్తి 19 లక్షల 15 వేల బేల్స్‌గా అంచనా వేసినట్లు ఆయన చెప్పారు. ఇది గత ఏడాది కంటే 20 శాతం అధికంగా ఉన్నదని అన్నారు. తాను ఇటీవల ఢిల్లీకి వెళ్ళినప్పుడు కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీని కలిసి ఈ అంశాలపై చర్చించినట్లు చెప్పారు. మహబూబ్‌నగర్‌లో సిసిఐ బ్రాంచ్‌ను ఏర్పాటు చేయడం వల్ల రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లా రైతులకు ప్రయోజనం కలుగుతుందని ఆయన చెప్పారు.

చిత్రం.. మంగళవారం హైదరాబాద్‌లో మార్కెటింగ్ అధికారులతో
ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు