తెలంగాణ

‘మత్తు’ వదిలిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్ మాఫియా కేసులో కొందరు విద్యార్థులు, ఐటి ఉద్యోగులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది. మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం, బాధితులను విచారణాధికారులు గుర్తించారు. అయితే వీరి పేర్లను గోప్యంగా ఉంచామని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. మాదక ద్రవ్యాల కేసులో ఎవరున్నా వారి మత్తు వదిలిస్తామని ఆయన హెచ్చరించారు. మాదక ద్రవ్యాల రవాణా, వినియోగం కేసులో దర్యాప్తు జరుపుతున్న కొద్దీ ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అనేక మంది ప్రముఖుల పిల్లలే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీరిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశామని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. టాస్క్ఫోర్స్ దర్యాప్తులో వెయ్యిమందికి పైగా పాఠశాల విద్యార్థులే ఈ ముఠా ఖాతాదారులుగా ఉన్నట్టు బయటపడింది. వీరంతా నగరంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో చదువుతుండడం గమనార్హం. ఈనెల 14న నగరంలోని దాదాపు 86 పాఠశాలలు, 56 కళాశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించనున్నామని అకున్ సబర్వాల్ వివరించారు. పాఠశాలల యాజమాన్యలతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సమావేశానికి హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
నిందితుల సెల్‌ఫోన్ కాల్స్, వాట్సాప్ గ్రూపులు, ఈమెయిల్ సంభాషణల వంటి వాటి ఆధారంగా మాదక ద్రవ్యాల కొనుగోలు, వినియోగదారుల జాబితా సిద్ధం చేసే పనిలో దర్యాప్తు అధికారులు నిమగ్నమై ఉన్నారు. మాదకద్రవ్యాలు ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసి, కొరియర్ ద్వారా దిగుమతి చేసుకున్నట్టు నిందితులు చెబుతుండగా..అందులో నిజనిజాలు పరిశీలించడంతోపాటు, ఆధారాలు సేకరించడంపైనే దృష్టి సారించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 16 మందిని అరెస్టు చేశామని, మరికొందరిని అరెస్టు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అకున్ సబర్వాల్ తెలిపారు. ఇదిలావుండగా మాదకద్రవ్యాల కొనుగోలు దారులపై కేసులు పెట్టే ఉద్దేశం లేదని, వారి వివరాలను వారివారి తల్లిదండ్రులకు తెలియజేస్తే..వారి పిల్లలకు చికిత్స చేయించుకునే వీలుంటుందని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చెబుతున్నారు. త్వరలో జాబితా ప్రకటిస్తామని, ఈ జాబితాలో డ్రగ్స్ సరఫరా చేసే వారు ఉంటే మాత్రం కేసులు పెడతామని అధికారులు వెల్లడించారు.