తెలంగాణ

‘పచ్చ’ తోరణానికి రాష్ట్రం ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 11: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న హరితహారం మూడో విడత కార్యక్రమం మరికొన్ని గంటల్లో రాష్ట్రంలో ఆరంభం కానుండగా, ఈ ఆకుపచ్చ యజ్ఞానికి రాష్ట్రం మొత్తం ముస్తాబైంది. బుధవారం ఉదయం 11:30 గంటలకు సిఎం కెసిఆర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండికాలనీ బతుకమ్మ కుంట వద్ద మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇక్కడ సిఎం మొక్క నాటే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం ప్రారంభం కానుంది. ఒకేరోజు లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో కూడా సిఎం పాల్గొని మొక్కలు నాటనున్నారు. సిఎం పర్యటన గ్రాండ్ సక్సెస్ అయ్యేలా ఇప్పటికే జిల్లాకు చెందిన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గత ఐదు రోజులుగా జిల్లా కేంద్రంలోనే మకాం వేసి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించారు. అటు సిఎం కార్యాలయ అధికారులైన స్మితా సబర్వాల్, ప్రియాంకవర్గీస్‌లు సైతం హరితహారంపై ఇప్పటికే ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తూ పలుమార్లు అధికారులు, ఇతర వర్గాలతో సమావేశమై విజయవంతానికి కృషి చేయాలని కోరారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ నిత్యం అధికారులతో సమీక్షలు, ఆదేశాలతో క్షణం తీరికలేకుండా విధులు కొనసాగిస్తున్నారు. హరితదళాల (గ్రీన్ బ్రిగేడ్స్)ను సిద్ధం చేశారు. ముఖ్య కూడళ్లల్లో పాత గడ్డి (గ్రాస్)ని తొలగించి కొత్త గడ్డిని వేశారు. కూడళ్లల్లో అందమైన పెద్ద పెద్ద మొక్కలను నాటారు. సిఎం స్వాగత తోరణాలతో నగరాన్ని నింపేశారు. సిఎం పర్యటన సందర్భంగా పలుచోట్ల దారి మళ్లింపు చర్యలు చేపట్టనున్నారు. సిఎం టూర్ సందర్భంగా 2వేల మంది పోలీసులతో బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు పోలీసు కమీషనర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు.

చిత్రం.. కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో ముస్తాబవుతున్న బహిరంగ సభా వేదిక.