తెలంగాణ

ఐసెట్ సీట్ల కేటాయింపు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: తెలంగాణలో ఐసెట్ అడ్మిషన్ల తొలి దశను గురువారం పూర్తి చేశారు. ఐసెట్‌లో 69,100 మంది అర్హత సాధించగా అందులో 33,262 మంది సర్ట్ఫికేట్ల పరిశీలనకు హాజరయ్యారు. వారిలో 31,629 మంది వెబ్ ఆప్షన్లను నమోదు చేయగా, 23,030 సీట్లు భర్తీ చేశారు. ఇంకా 328 సీట్లు మిగిలిపోయాయని కన్వీనర్ ఎ వాణి ప్రసాద్ తెలిపారు. 100 శాతం సీట్లు 276 కాలేజీల్లో భర్తీ చేయగా, ఈసారి సున్నా అడ్మిషన్లున్న కాలేజీలు లేకపోవడం విచిత్రమని అన్నారు. ఎంబిఎ కోర్సును 22 ప్రభుత్వ , 256 ప్రైవేటు విద్యాసంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. 22 ప్రభుత్వ కాలేజీల్లో 1330 సీట్లు నిండాయి, 256 ప్రైవేటు కాలేజీల్లో 19,951 సీట్లకు గానూ 19705 సీట్లు భర్తీ అయ్యాయి. అలాగే ఎంసిఎలో 14 ప్రభుత్వ కాలేజీల్లో 680 సీట్లకు 678 భర్తీ కాగా, 27 ప్రైవేటు కాలేజీల్లో 1397 సీట్లకు గానూ 1317 సీట్లు భర్తీ అయ్యాయి. ఫీజులను 20వ తేదీలోగా చెల్లించాలని, 13వ తేదీ నుండి 20వ తేదీ మధ్య కాలేజీల్లో రిపోర్టు చేయాలని ఆమె పేర్కొన్నారు. కాగా పాలిటెక్నిక్ రెండో దశ కౌనె్సలింగ్‌లో గురువారం సాయంత్రం వరకూ 17,608 మంది తమ వెబ్ ఆప్షన్లను వినియోగించుకున్నారు. మొత్తం సీట్లు 21,990 ఉన్నాయని, 15 వ తేదీ రాత్రి 8 గంటలకు సీట్ల కేటాయింపు చేస్తామని కన్వీనర్ ఎ వాణి ప్రసాద్ తెలిపారు.