తెలంగాణ

బోగస్ పాస్‌పుస్తకాలపై రుణాలు ఇవ్వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: బోగస్ పాస్‌పుస్తకాలపై వ్యవసాయ రుణాలు ఇవ్వవద్దని బ్యాంకర్లకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బిఆర్ మీనా సూచించారు. గురువారం ఇక్కడ జరిగిన బ్యాంకర్ల స్టీరింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, ప్రస్తుతం భూములకు సంబంధించిన రికార్డులు, పట్టేదార్లపేర్లు వెబ్‌సైట్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. పంట రుణాల కోసం బ్యాంకులకు వెళ్లే రైతులు తమ వెంట పాస్‌పుస్తకాలను, పహణీలను తీసుకువెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ రూపందించిన వెబ్‌సైట్‌లో భూములకు సంబంధించిన అన్ని వివరాలు ఉన్నాయని, వీటిని బ్యాంకర్లు వినియోగించుకోవాలని కోరారు. ఇప్పటి వరకు 21 బ్యాంకులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నాయని, ఇతర బ్యాంకులు కూడా ఈ సౌకర్యాన్ని వాడుకోవాలని మీనా సూచించారు.
పంట రుణాలు ఇవ్వడాన్ని యుద్ధప్రాతిపదికపై కొనసాగించాలని బ్యాంకర్లను వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి కోరారు. ఇప్పటి వరకు ప్రస్తుత ఖరీఫ్ పంటలకు 8,35,748 మంది రైతులకు 6056 కోట్ల రూపాయలను పంట రుణాలుగా ఇచ్చారని గుర్తు చేశారు. ఖరీఫ్ పంటల లక్ష్యాల్లో ఇది 25 శాతంగా ఉంటుందని వివరించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోనజనలో రైతులందరినీ భాగస్వామ్యం చేయాలని కోరారు. ఈ సంవత్సరం కనీసం 40 శాతం మంది రైతులైనా పంటల బీమా పరిధిలోకి వచ్చేలా చూడాలన్నారు.
పంటల బీమాకు సంబంధించి నిర్ణయించిన తేదీలపై రైతులను చైతన్యం చేసేందుకు బ్యాంకర్లు చొరవ చూపించాలన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకులు పనిచేసాయని భారతీయ స్టేట్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ హర్దయాల్ ప్రసాద్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.