తెలంగాణ

ఖండించిన ఐఏఎస్ అధికారుల సంఘం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతీ మీనా పట్ల ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచిత ప్రవర్తనను ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సంఘం డిమాండ్ చేసింది. ఐఏఎస్ అధికారుల సంఘం గురువారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బిపి ఆచార్య అధ్యక్షతన సమావేశమైంది. తన పట్ల గత కొంతకాలం ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రవర్తిస్తున్న తీరును సమావేశానికి హాజరైన మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతీ మీనా వివరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ప్రజాప్రతినిధుల నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఐఏఎస్ అధికారులు కొందరు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. తాజాగా జరిగిన మహబూబాబాద్ సంఘటనతో సహా ఇతర జిల్లాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సమావేశం నిర్ణయించింది. సమావేశంలో చర్చించిన అంశాలను శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్‌ను కలిసి వివరించాలని సంఘం నిర్ణయించింది. విధుల నిర్వహణలో అధికారులకు ఎదురయ్యే ఇబ్బందులపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సమావేశం అభిప్రాయపడింది. మహబూబాబాద్ ఘటనపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు వెంటనే స్పందించి, ఎమ్మెల్యేతో క్షమాపణ చెప్పించడం పట్ల సమావేశం కృతజ్ఞతలు తెలియజేసింది.