తెలంగాణ

కెసిఆర్ ఓ తోడేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మాదిరిగా తాము తోడేలు కాదని, ఆయన తోడేలు కాబట్టే ప్రతిపక్ష నేతలంతా గొర్రెల్లా కనిపిస్తున్నారని సిఎల్పీ ఉప నాయకుడు టి.జీవన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. ప్రతిపక్ష నేతలను తోడేళ్లు అంటూ సిఎం కెసిఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడిన తీరుపై స్పందించిన జీవన్‌రెడ్డి గురువారం నాడిక్కడ అసెంబ్లీ మీడియా హాల్లో విలేకరుల సమావేశంలో తూర్పారబట్టారు. యాదవులకు గొర్రెల పంపిణీ పథకాన్ని తాము స్వాగతిస్తున్నామని, కాకపోతే పంపిణీ చేసిన ప్రతి గొర్రె పిల్ల ఆరు నెలలు వయస్సు మించి లేదని అన్నారు. 3.59 లక్షల యూనిట్ల గొర్రెలను పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 40 వేల యూనిట్లను మాత్రమే పంపిణీ చేసిందని అన్నారు. ప్రభుత్వం ఒక వేళ చెప్పిన అన్ని గొర్రెలు పంపిణీ చేస్తే, వాటి ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు 1500 మంది వెటర్నరీ డాక్టర్లు అవసరమవుతారని తెలిపారు.
రైతులకు నగదు కొరత తీర్చాలి
బ్యాంకుల్లో నగదు కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున రిజర్వు బ్యాంక్ స్పందించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఆర్‌బిఐ ప్రాంతీయ సంచాలకుడికి వినతిపత్రం ఇచ్చారు. బ్యాంకుల్లో సరిపడా నగదు లేకపోవడం వల్ల రైతులు అవసరమైన సమయంలో నగదు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బ్యాంకులకు ఇప్పటికే రూ.2000 కోట్లు పంపిణీ చేశామని, మరో వారం రోజుల్లో మరో రెండు వేల కోట్లు పంపిణీ చేస్తామని ఆర్‌బిఐ డైరక్టర్ చెప్పినట్లు విహెచ్ అన్నారు. రైతులు, పెన్షనర్లకు నగదు కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
బ్యాంకుల వద్ద ధర్నా
రుణమాఫీ సమస్యతో పాటు పలు రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ బ్యాంకుల వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు కిసాన్ కేత్ కాంగ్రెస్ సెల్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి తెలిపారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ఏడాది ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు అందిస్తామన్న నష్టపరిహారం రూ.1500 కోట్లను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.