తెలంగాణ

మద్యం నియంత్రణపై ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: రాష్ట్ర ప్రభుత్వం మద్యం ప్రధాన ఆదాయ వనరుగా చేసుకోవడం వల్ల మద్యం సేవించిన భర్త వల్ల పేద మహిళలు ఆర్ధికంగా నష్టపోవడమేగాక కుటుంబ పోషణ మరింత భారమవుతోందని, మద్యం నియంత్రణపై మహిళా మోర్చ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ బిజెపి కార్యాలయంలో నిర్వహించిన మహిళా మోర్చ రాష్ట్ర పదాధికారుల సమావేశానికి రాష్ట్ర మహిళా మోర్చ అధ్యక్షురాలు ఆకుల విజయ అధ్యక్షత వహించారు. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ నరేంద్రమోదీ ప్రభుత్వ మహిళా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఇంటింటికీ చేర్చేందుకు మహిళా కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. సుకన్య సమృద్ధి యోజన , భేటీ బచావో- భేటీ పడావో, ప్రసవించిన స్ర్తిలకు ఆరు వేల రూపాయిల పారితోషికం, ఉజ్వల పథకం ద్వారా పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ముద్రా బ్యాంకు ద్వారా రుణాలు, ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచడం, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేయడానికి ప్రతి బ్యాంకు మహిళకు 10 లక్షల నుండి కోటి రూపాయిల వరకూ రుణ సదుపాయం కల్పించడం, తదితర పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని డాక్టర్ లక్ష్మణ్ కోరారు.
రెండు పడకల గదుల విషయంలో , మద్య నియంత్రణ కోసం, ప్రజాసమస్యలపై విస్తృతంగా పోరాటాలు చేపట్టాలి. రాష్ట్రంలో ఉన్నది ప్రజాసంక్షేమ ప్రభుత్వమా లేక మద్యాన్ని అమ్మే ప్రభుత్వమా? క్లబ్ -పబ్బు సంస్కృతి టిఆర్‌ఎస్ హయాంలో విచ్చలవిడిగా పెరిగిందని, రాయితీలు, సబ్సిడీలతో పాటు ఒకటి కొంటే మరొకటి ఉచితంగా ఇస్తున్న బార్లు, క్లబ్బులపై చర్యలేవని లక్ష్మణ్ ప్రశ్నించారు. ప్రజలు ఊరూరా బార్లు, బీర్లు వస్తున్నాయని, దీనిపై కఠినంగా వ్యవహరించాలని, మద్యం సేవించి, వాహనాలు నడిపి ప్రమాదాలు సంభవిస్తున్నాయని, అనేక మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోతున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి మహిళామోర్చ భారీ ఎత్తున కార్యక్రమాలను రూపొందించాలని, కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను మార్చి టిఆర్‌ఎస్ తమ సొంత పథకాలుగా చెప్పుకోవడం సిగ్గుచేపటని అన్నారు. వితంతువులు సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా మహిళా మోర్చ కార్యకర్తలు చైతన్యవంతం చేయడానికి కార్యక్రమాలను రూపొందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిథి కె పుష్పలీల, జాతీయ కార్యదర్శి బండారు శృతి, ఎస్సీ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యురాలు రజనీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గురువారం పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతున్న బిజెపి నేత లక్ష్మణ్