తెలంగాణ

పాతబస్తీ బోనాలకు సర్వం సన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: పాతబస్తీలో ఈ నెల 16, 17 తేదీల్లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు గాను సంబంధిత అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. గురువారం బోనాల ఉత్సవ ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులతో సమీక్షించిన అనంతరం మంత్రి పాతబస్తీలోని హరిబౌలిలోని బంగారు మైసమ్మ ఆలయం, అక్కన్న మాదన్న ఆలయం, ముత్యాలమ్మ ఆలయం, గౌలిపురలోని భరతమాత ఆలయం, లాల్‌దర్వాజలోని సింహవాహిని మహంకాళి ఆలయాలను అధికారులతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా లాల్‌దర్వాజలో విలేకరులతో మాట్లాడుతూ రూ.5.50 కోట్ల వ్యయంతో జిహెచ్‌ఎంసి ద్వారా 220 అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. ఉత్సవాలు జరిగే రెండు రోజుల పాటు పారిశుద్ధ్య పనుల కోసం దాదాపు 500 మంది సిబ్బందిని వినియోగించినట్లు తెలిపారు. సుమారు రూ.50 లక్షల వ్యయంతో అమ్మవారి ఆలయాల వద్ద, ఊరేగింపు జరిగే మార్గాల్లో తాత్కాలిక విద్యుత్‌దీపాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. రంజాన్, బోనాల ఉత్సవాల కోసం దాదాపు 2500 లైట్లను సౌత్ జోన్ మొత్తం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని మెట్రో వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. సాంస్కృతిక శాఖ ద్వారా పాతబస్తీలో 12 ప్రాంతాల్లో రెండు రోజుల పాటు కళావేదికలను ఏర్పాటు చేశామని తెలిపారు. అక్కన్న మాదన్న, లాల్‌దర్వాజ అమ్మవారి ఆలయాలకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించనున్నట్లు మంత్రి వివరించారు. పాతబస్తీలో త్రీడీ మ్యాపింగ్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బోనాల జాతర సందర్భంగా శాంతిభద్రతల అంశంలో అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసులను ఆయన ఆదేశించారు. పాతబస్తీలోని సర్ధార్ మహల్‌లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు.