తెలంగాణ

బంగారు తెలంగాణకు మూడు సూత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: బంగారు తెలంగాణ సాధించేందుకు మూడు సూత్రాలపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాల్సి ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. సరస్వత్ పేర్కొన్నారు. ‘బంగారు తెలంగాణ-సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు’(ఎస్‌డిజి) అంశంపై ఇక్కడి మర్రిచెన్నారెడ్డి మానవ వనరులు అభివృద్ధిసంస్థ (ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డి) లో గురువారం ఏర్పాటు చేసిన జాతీయ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ఆర్థిక, సామాజిక, పర్యావరణ అంశాలు అభివృద్ధికి ప్రధాన సూత్రాలని, అభివృద్ధి వ్యూహాల్లో ఎస్‌జిడి లక్ష్యాలు కీలకమైనవన్నారు. విద్యావిధానాన్ని పునర్వ్యవస్థీకరించడం, పర్యావరణ రక్షణకు ఫకడ్బందీ వ్యూహాలు రూపొందించి అమలు చేయాల్సి ఉందన్నారు.
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు ఎస్. నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు 14 వేల కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టామన్నారు. మూడో విడత హరిత హారం పూర్తయితే పచ్చదనం 24 శాతం నుండి 33 శాతానికి పెరుగుతుందని, అంతర్జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా అటవీ విస్థీర్ణం శాతం ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మురుగునీటి పారుదల, పారిశుద్ధ్య సదుపాయాలను మెరుగుపరిచేందుకే ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నదని ప్రభుత్వ సలహాదారు బివి పాపారావు పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలు రూపొందించిన ప్రణాళికలు ఎస్‌జిడి లక్ష్యాలను అందుకోవడంలో కీలకభూమిక పోషిస్తున్నాయని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ప్రణాళిక) బిపి ఆచార్య పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ సమన్యయంతో పనిచేయాలని పిలుపు ఇచ్చారు. భారతదేశంలో ఎస్‌జిడి లక్ష్యాలు ఎంత వరకు విజయవంతం అవుతాయన్న అంశంపై జాతీయ అభివృద్ధి ఆధారపడి ఉంటుందని ఐక్యరాజ్యసమతి కోఆర్డినేటర్ డిగో పాలసియోస్ పేర్కొన్నారు. చిన్నపిల్లల చదువు, వైద్యం తదితర అంశాల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని యూనిసెఫ్ హైదరాబాద్ విభాగం అధినేత మిథల్ రస్థియా సూచించారు. సంస్థ డీన్ ఆఫ్ స్టడీస్ డాక్టర్ గౌతం పింగ్లే తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు.

చిత్రం.. గురువారం హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధిసంస్థలో నిర్వహించిన వర్క్‌షాపులో ప్రసంగిస్తున్న నీతి అయోగ్ సభ్యుడు సరస్వత్