తెలంగాణ

సారీకి శాంతించని కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జూలై 13: మహబూబాబాద్ జిల్లాలో హరితహారం సాక్షిగా జిల్లా కలెక్టర్ ప్రీతీమీనాకు జరిగిన అవమానాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ కలెక్టర్ చేయి పట్టుకోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చజరుగుతోంది. ఈవిషయాన్ని ఐఏఎస్ సంఘాలు కూడా సీరియస్‌గా తీసుకోవడం, స్వయంగా సిఎం కేసీఆర్ జోక్యం చేసుకొని ఎమ్మెల్యే శంకర్‌నాయక్ చేత క్షమాపణ చెప్పించినా సమస్య సద్దుమణగలేదు. క్షమాపణకు ముందుగానే ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై కలెక్టర్ మహబూబాబాద్ టౌన్ పొలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మంత్రి చందూలాల్, ఎంపి సీతారాంనాయక్ సమక్షంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ కలెక్టర్‌కు క్షమాపణ చెప్పినప్పటికీ కలెక్టర్ పోలీస్టేషన్‌లో పెట్టిన కేసు ఉపసంహరించుకోలేదు. దీంతో బుధవారం రాత్రి కలెక్టర్ పిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై పోలీసులు కేసునమోదు చేసారు. ఈమేరకు గురువారం ఉదయం ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ముందస్తుగానే పోలీస్టేషన్‌లో లొంగిపోయాడు. ఎమ్మెల్యేపై 353,354 సెక్షన్‌ల కింద కేసునమోదు అయింది. ఎమ్మెల్యేను ప్రాథమిక విచారణ చేసిన అనంతరం పోలీస్టేషన్‌లోనే బెయిల్ మంజూరు చేసారు. స్టేషన్ నుండి కేసముద్రం మండల కేంద్రంలో జరిగిన హరితహారంలో పాల్గొని నేరుగా సిఎం కలిసేందుకు హైద్రాబాద్ బయలుదేరి వెళ్లారు.
మానుకోటలో మిన్నంటిన ఆందోళనలు
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతిమీనాపై స్ధానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అనుచితంగా ప్రవర్తించి సంఘటన చిలికి చిలికి గాలివానలా మారింది. అనుకోకుండా జరిగిందా, ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనే విషయం పక్కన పెడితే ఇదే సంఘటనలు ప్రతిపక్షాలు కూడా అస్త్రంగా తీసుకున్నాయి. దీంతో మానుకోటలోని ప్రగతిశీల మహిళా సంఘాలు ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం చేసాయ. సిపిఎం, సిపిఐ, న్యూడెమాక్రసీ, బిజెపి, టిఎమ్మార్పీఎస్, కాంగ్రెస్ సైతం ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను బర్తరఫ్ చేయాలంటూ చేస్తున్న ఆందోళనలు మిన్నంటాయి. ఎమ్మెల్యేను బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేస్తు అన్ని పార్టీలు వేరువేరుగా ఆందోళనలు నిర్వహించాయి. సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి మాట్లాడుతూ.. కలెక్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే దురహంకారానికి, ఆహంభావానికి పరాకాష్ట అన్నారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టర్ ప్రీతిమీనాకు జరిగిన అవమానానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఎమ్మెల్యేను స్వయాన సిఎం రాజీనామా చేయించి మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే ఘటనతో ఒక్కసారిగా అన్ని పార్టీలు, ప్రజా సంఘాల నుండి నిరసనలు వెల్లువెత్తాయి.

చిత్రాలు.. మహబూబాబాద్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయేందుకు తన వాహనంలో వచ్చిన
ఎమ్మెల్యే శంకర్‌నాయక్. కాంగ్రెస్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న నాయకులు