తెలంగాణ

హైటెన్షన్ టవర్ల పరిహారం ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూలై 13: మహారాష్టల్రోని వార్ధా నుండి ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాల మీదుగా రంగారెడ్డి జిల్లా వరకు నిర్మిస్తున్న విద్యుత్ హైటెన్షన్ టవర్లకు సంబంధించిన పరిహారం కోసం రైతులు గురువారం కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించగా గందరగోళ పరిస్థితి నెలకొంది. పరిహారం చెల్లిస్తామని పూర్తి హామీ ఇవ్వకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని పలువురు రైతులు విషం డబ్బాలను వెంట తెచ్చుకున్నారు. సర్పంచుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అందోల్ క్రిష్ణ, సిపిఎం అనుబంధ సంఘాల నాయకుల నేతృత్వంలో కోర్పోల్, లింగంపల్లి, బోర్పట్ల, వెండ్రికోల్, పసల్‌వాది, కంది, జూల్‌కల్, కాశీపూర్, కలివేముల గ్రామాలకు చెంది న సుమారు 150 మంది రైతులు ఆందోళనకు దిగారు. ఉదయం 11 గంటలకు సమీకృత కలెక్టరేట్ వద్దకు చేరుకుని ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. గేటు ముందు బైఠాయించి తగిన పరిహారం అందించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. ఈ నేపథ్యంలో అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కొంత మంది రైతులు పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించడం తో గందరగోళం నెలకొంది. అక్కడే ఉన్న ఇతర రైతులు, మీడియా ప్రతినిధులు డబ్బాలను లాగేసుకోవడంతో ప్రమాదం తప్పిపోయింది. ఒకరిద్దరు రైతులు వెంబడి తెచ్చుకున్న తాడుతో కలెక్టరేట్ ప్రదాన గేటుకు ఉరి వేసుకునే ప్రయత్నం చేస్తూ నిరసన వ్యక్తం చేసారు. అనంతరం డిఆర్‌ఓ రఘురాంశర్మను కలిసిన నాయకులు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. హైటెన్షన్ విద్యుత్ టవర్ల నిర్మాణానికి సంబంధించి భూ నష్టపరిహారాన్ని చెల్లించాలని కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకా రం పరిహారం అందించాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేసారు. మూడు రోజుల్లో పరిహారం అందేలా విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో చర్చ లు జరిపి రైతులకు న్యాయం చేకూర్చాలని, లేనిపక్షం లో పనులను నిలిపివేయించాలని ఆయా మండలాల తహశీల్దార్లకు డిఆర్‌ఓ రఘురాంశర్మ ఆదేశించారు. మూడు రోజుల్లో పరిహారం అందిస్తామని నాయకులకు లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా అందోల్ క్రిష్ణ మాట్లాడు తూ మూడు జిల్లాల్లో వేలాది మంది రైతులకు అన్యాయం జరుగుతుందని, వారికి సరియైన పరిహారం అందించే వరకు పోరాటం కొనసాగిస్తామని, రైతుల కోసం ప్రాణా లు అర్పించడానికైనా సిద్ధమన్నారు.

చిత్రం.. సంగారెడ్డి కలెక్టరేట్ ముందు ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహిస్తున్న హైటెన్షన్ విద్యుత్ వైర్ల భూ నిర్వాసితులు,