తెలంగాణ

రైతు సమస్యలపై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదు: మంత్రి హరీష్‌రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 13: అధికారంలో ఉన్నప్పు డు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రైతాంగం సంక్షోభంలో ఉందంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని రైతు సమస్యలపై మాట్లాడే నైతిక అర్హత కాం గ్రెస్ పార్టీకి లేదని రాష్ట్ర ఇరిగేషన్, మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీష్‌రావు విమర్శించారు. గురువారం మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పథకాలకు మంత్రులు జి.జగదీష్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఎన్. భాస్కర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతు రైతు సమస్యలపై ఆందోళనలు చేయాలన్న పిసిసి చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే విద్యుత్ సమస్యలను అధిగమించి రైతాంగానికి కోతల్లేని తొమ్మిది గంటలు విద్యుత్ అందించి వచ్చే ఏడాది నుండి 24 గంటల విద్యుత్ అందిస్తున్నందుకు రైతులను ధర్నాలు చేయమంటారాః అంటు ఉత్తమ్‌ను ప్రశ్నించారు. 17వేల కోట్ల రుణమాఫీ చేసి, క్యూలైన్ల సమస్య లేకుండా ఎరువులను సరఫరా చేస్తున్నందుకు ధర్నాలు చేయమంటారా అం టూ నిలదీశారు. రికార్డు స్థాయిలో 6,500 కోట్ల తో ధాన్యం కొనుగోలు చేసినందుకు, 1000 కోట్లతో 18లక్షల మెట్రిక్ టన్నుల గోదాం లు నిర్మించినందుకు, మిషన్ కాకతీయతో చెరువులను బాగు చేస్తున్నందుకు రైతులను ధర్నా చేయమంటారా అంటు కాంగ్రెస్ పార్టీకి చురకలేశారు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే మిషన్ కాకతీయకు 1000 కోట్లు మంజూరు చేశామన్నారు. ప్రతి రెండున్నర వేల ఎకరాలకు వ్యవసాయ విస్తరణాధికారిలను నియమించి పంటల సాగు లో రైతులకు చేదోడుగా ఉండి, లక్ష కోట్లతో ప్రాజెక్టులు కట్టి తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు సిఎం కెసిఆర్ ప్రభు త్వం చేస్తున్న కృషి వద్దంటూ ధర్నాలు చేయమంటారా? అంటూ హరీష్‌రావు నిప్పులు చెరిగారు. వచ్చే ఏడాది నుండి కెసిఆర్ ప్రభు త్వం రైతులకు ఎకరాకు పెట్టుబడుల కోసం ఏడాదికి వేయి రూపాయలు అందించే పథకా న్ని వద్దని ధర్నా చేయమంటారా అంటు అసలు కాంగ్రెస్ నేతలకు రైతుల గూర్చి మాట్లాడే నైతిక హక్కు లేదంటు ధ్వజమెత్తారు. ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తూ కాళేశ్వరం నీటితో భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలను సస్యశ్యామలం చేస్తున్నామని, 280 కోట్లతో మూసీ కాలువలను ఆధునీకరిస్తున్నామన్నారు.
నాగార్జున సాగర్ కాలువల పూర్తికి, ఆధునీకరణకు మూడేళ్లలో 1300కోట్లు ఖర్చు చేశామన్నారు. వచ్చే ఏడాదికల్లా ఉదయ సముద్రం ప్రాజెక్టు కింద సాగునీరందిస్తామన్నారు. పాలమూరు-డిండి పథకం రిజర్వాయర్ల నిర్మాణాలు సాగుతున్నాయన్నారు. పేదలు, వృద్ధులకు ఆసరాగా 5వేల కోట్లతో ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, ఆడపిల్ల భారమన్న భావన రూపుమాపేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను, మాతాశిశు సంక్షేమానికి కెసిఆర్ కిట్ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరిస్తూ పేదల్లో ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచామన్నారు.
మంత్రి జి.జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై పిసిసి చీఫ్ ఉత్తమ్ చేస్తున్న విమర్శల పట్ల ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ రాక్షస పాలనలో తెలంగాణ రైతులను, పరిశ్రమలను పవర్ హాలిడేలతో చీకట్లో ముంచి తే మూడేళ్ల సిఎం కెసిఆర్ తెలంగాణ ప్రభుత్వ పాలనలో రైతులకు తొమ్మిది గంటల నిరంతర విద్యుత్ అందించిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. రానున్న ఎన్నికల్లో సైతం ఉమ్మడి జిల్లాలోని 12అసెంబ్లీ నియోజకవర్గాల ను టిఆర్‌ఎస్ గెలుస్తుందన్నారు. మంత్రి తుమ్మ ల మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లా సస్యశ్యామలం కోసం ఒకవైపు కాళేశ్వరం, ఇంకోవైపు డిండి,ఎస్సారెస్పీ, మూసీ, ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టుల ద్వారా గోదావరి జిల్లాల తరహాలో పంటల సాగు జరిగేలా చూస్తున్నారన్నారు. అధికారంపై కాంగ్రెస్ నేతల కలలు కల్లలవుతాయని సిఎం కెసిఆర్ గొంతులో ప్రాణమున్నంత వరకు ఆయనే సిఎంగా ఉంటారన్నా రు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నకిరేకల్- మాచర్ల, జడ్చర్ల-దేవరకొండ జాతీయ రహదారులు నిర్మాణంలో ఉన్నాయన్నారు.

చిత్రం.. మిర్యాలగూడ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులను ప్రారంభిస్తున్న మంత్రులు హరీష్‌రావు, జగదీశ్‌రెడ్డి,తుమ్మల