తెలంగాణ

కిడ్నీ రోగులకు శుభవార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: రాష్ట్రంలో కొత్తగా 39 వైద్య శాలల్లో 268 సింగిల్ యూజ్డ్ డయాలసిస్ యూనిట్లు నెలకొల్పేందుకు వీలుగా తెలంగాణ వైద్య సేవలు వౌలిక వసతుల అనివృద్ధి సంస్ధ ఆదేశాలు జారీ చేసిందని వైద్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ యూనిట్లకు సంబంధించి పరికరాల కొనుగోలుకు టెండర్లను కూడా పూర్తి చేశామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో వీటిని నడిపేందుకు రంగం సిద్ధమైందన్నారు. ఆరోగ్య శ్రీ కింద డయాలసిస్ అవసరమైన రోగులకు ఉచితంగా ఈ సేవలు అందిస్తామన్నారు. దేశంలో మొదటి సారిగా ప్రభుత్వ వైద్య శాలలో ఆర్‌వో ప్లాంట్ సహా సింగిల్ యూజ్డ్ డయాలసిస్ కేంద్రాలను నెలకొల్పుతామన్నారు. ఈ సేవలు త్వరలో అమలులోకి తేనున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ కింద 9వేల నుంచి పదివేల మంది డయాలసిస్ అవసరమైన రోగులున్నారన్నారు. ప్రతి ఏటా కిడ్నీ బాధితులు 1500 నుంచి రెండు వేల వరకు పెరుగుతుందన్నారు. దీంతో డయాలసిస్ కేంద్రాల అవసరం ఏర్పడిందన్నారు. కాని ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య శాలల్లో అతి తక్కువగా హైదరాబాద్‌లోని ప్రధాన వైద్య శాలల్లో మాత్రమే డయాలసిస్ యూనిట్లు ఉండేవన్నారు. 1ఇప్పటికే నిజామాబాద్, ఆదిలాబాద్, సిద్ధిపేట, మహబూబాబాద్ తదితర ప్రాంతాల్లో ఆరు డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పాత ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల ఏరియా హాస్పిటల్‌లో ఐదు యూనిట్లు, నిర్మల్ ఏరియా ఆసుపత్రిలో ఐదు యూనిట్లు, రిమ్ ఆదిలాబాద్ జిల్లాలో పది యూనిట్లు, ఉట్నూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఐదు యూనిట్లు, పాత రంగారెడ్డి జిల్లాలో తాండూరు జిల్లా హాస్పిటల్‌లో పది యూనిట్లు, వనస్ధలిపురం ఏరియా ఆసుపత్రిలో ఐదు యూనిట్లు, వికారాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఐదు యూనిట్లు, మహేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఐదు యూనిట్లు, పాత మెదక్ జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో పది యూనిట్లు సిద్ధిపేట ఏరియా ఆసుపల్రో ఐదు యూనిట్లు, మెదక్ ఏరియా ఆసుపత్రిలో ఐదు యూనిట్లు, జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఐదు యూనిట్లు నెలకొల్పుతారు. పాత మహబూబ్‌నగర్ జిల్లాలో గద్వాల్ ఏరియా ఆసుపత్రిలో ఐదు యూనిట్లు, నాగర్‌కర్నూలు ఏరియా ఆసుపత్రిలో ఐదు యూనిట్లు, వనపర్తి ఏరియా ఆసుపత్రిలో ఐదు యూనిట్లుల, మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రిలో ఆరు యూనిట్లు, హైదరాబాద్ మలక్‌పేట ఏరియా ఆసుపత్రిలో ఐదు యూనిట్లు, మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రిలో ఆరు యూనిట్లు, పాత నల్లగొండ జిల్లా ఆసుపత్రిలో పది యూనిట్లు, సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో ఐదు యూనిట్లు, మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో ఐదు యూనిట్లుల, హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రిలో ఐదు యూనిట్లు, పాత నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో ఐదు యూనిట్లు, బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో ఐదు యూనిట్లు, బోధన్ ఏరియా ఆసుపత్రిలో ఐదు యూనిట్లుల, నిజామాబాద్ జిల్లా వైద్య శాలలో 15 యూనిట్లను నెలకొల్పనున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తరుణంలో ఆయా వైద్య శాలల్లో డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు అనువైన స్ధలాలు గుర్తిటంచి యంత్రాలు బిగించి త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ డయాలసిస్‌ను ఆరోగ్య శ్రీ కార్డులున్న రోగులకు పూర్తి ఉచితంగా సింగిల్ యూజ్డ్ డయాలసిస్ చేస్తామన్నారు. దేశంలో మొదటిసారిగా ప్రభుత్వ వైద్య శాలల్లో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రక్రియ వల్ల రోగులకు రక్షణ పెరిగి ఇన్‌ఫెక్షన్స్ తగ్గి ఎంతో మేలు జరుగుతుందన్నారు.