తెలంగాణ

బిసిల తొలగింపు కేసు విచారణ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల(బీసీ) జాబీతా నుంచి 26 కులాలను తొలిగించడాన్ని సవాల్ చేస్తు సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణ ఆరు వారాలు వాయిదా పడింది. శుక్రవారం నాడు జస్టిస్ మదన్ బి లోకూర్‌తో కూడిన ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్లు విచారణకు వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన అనంతరం ఏపీలో ఉన్న కులాలను తెలంగాణ రాష్ట్రంలో తొలిగించడం సరికాదని, విద్యా, ఉద్యోగ రంగాలలో బీసీ కులాలు సమస్యలను ఎదుర్కొంటున్నాయని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. దీనిపై సుప్రీంకోర్టులో దాఖలై పిటిషన్లను ఒకేసారి తుది విచారణను చేపడతామని ధర్మాసనం స్పష్టం చేస్తూ విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
తెలంగాణలో బీసీ జాబీతా నుంచి తొలిగిస్తూ జీవోఎంఎస్ నెంబరు 16ను 2015 మార్చి 11 నాడు విడుదల చేసింది. ఈ కులాలు తెలంగాణకు చెందినవి కావని, అందుకే ఈ కులాలను తెలంగాణ బీసీలుగా కాకుండా ఓసీలగా పరిగణిస్తూ జీవోను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఉమ్మడి హైకోర్టును వివిధ కులాలకు చెందన వారు ఆశ్రయించగా, హైకోర్టు ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో తొలిగించిన 26 కులాల వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
మియాపూర్ భూ
కుంభకోణం కేసు వాయిదా
మియాపూర్ భూ కుంభకోణం కేసులో ట్రినిటీ ఇన్ ఫ్రావెంచర్స్ లిమిటెట్ డైరెక్టర్ పార్థసారథికి, సువిశాల్ పవన్ జెన్ లిమిటెడ్ డైరెక్టర్ పీవీఎస్ శర్మలకు బెయిల్ మంజూరు విషయంలో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.మియాపూర్ భూ కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న పార్థసారథి, శర్మలకు గత నెల 16న సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఈ పిటిషన్ శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో విచారణకు రాగా, నిందుతులకు బెయిల్ మంజూరుపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయ్యలేదు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని నాలుగు వారాలకు వాయిదా వేసింది.