తెలంగాణ

రైతు సమగ్ర సర్వే వివరాలు పంపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: రైతు సమగ్ర సర్వే, పంటల బీమా పథకాలకు సంబంధించిన సవివరమైన నివేదికలను వారంలోగా పంపించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ విస్తరణాధికారులు, వ్యవసాయ అధికారులు, జాయింట్ డైరెక్టర్లు తదితరులతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వ్యవసాయ విస్తరణాధికారులు క్లస్టర్ల వారీగా వివరాలు పంపించాలని ఆదేశించారు. పంటల బీమాకు సంబంధించిన గడువు తేదీలను గ్రామ గ్రామాన ప్రచారం చేసి రైతులు పూర్తిగా వినియోగించుకునేలా చూడాలని కోరారు. మాభూమి-మాపంట పోర్టల్‌లో రైతు సర్వే వివరాలను వారంలోగా అప్‌లోడ్ చేయాలన్నారు. రుణమాఫీకి సంబంధించి డబ్బు బ్యాంకుల్లో జమకాని రైతులకు ఖాతాల్లో వెంటనే డబ్బు జమ అయ్యేలా చూడాలని ఆదేశించారు.

చిత్రం.. శనివారం సచివాలయంనుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి