తెలంగాణ

వితంతువులకు ఆర్థిక కార్పొరేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: రాష్ట్రంలో వితంతువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, వారు అనేక కష్టనష్టాలకు గురవుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు తమ కాళ్లపై తాము నిలబడటానికి ప్రత్యేక ఆర్థిక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిజెపి కార్యాలయంలో నేడు నిర్వహించిన బిజెపి బేటీ బచావో- బేటీ పడావో కమిటీ సమావేశానికి బేటీ బచావో-బేటీ పడావో రాష్ట్ర చైర్మన్ గొంగులూరి విజయలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ బిజెపి రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తే ప్రత్యేక ఆర్థిక కార్పొరేషన్‌ను వితంతువులకు ఏర్పాటు చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో తాగుడుకు, మాదక ద్రవ్యాలకు అలవాటై అనేక మంది బీద కుటుంబాల వారు ప్రాణాలు కోల్పోతున్నారని , మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అన్ని రకాలుగా నష్టం వాటిల్లుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం మహిళలకు బేటీ బచావో- బేటీ పడావో కార్యక్రమంతో పాటు ఉజ్వల పథకం ద్వారా రానున్న రెండు సంవత్సరాల్లో పేద మహిళలకు ఐదు కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తోందని అన్నారు. కార్యక్రమంలో బిజెపి నేతలు గీతామూర్తి, గొట్టాల ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. కాగా బిజెపి కార్యాలయంలో మాజీ సైనికోద్యోగుల విభాగం సమావేశం నిర్వహించారు. ఇందులో విభాగం కన్వీనర్ రాజేందర్‌రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి, సెల్ సభ్యులు పి బాలస్వామి, కె అశోక్ రెడ్డి, ఎస్ ప్రకాశ్ రావు, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.