తెలంగాణ

నైపుణ్యాలకు పదును పెడితే మరిన్ని ఉద్యోగావకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: నైపుణ్యాలకు పదును పెడితే మరిన్ని ఉద్యోగావకాశాలు కలుగుతాయని, తద్వారా బంగారు తెలంగాణ లక్ష్యాన్ని సాధించడం వీలవుతుందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంప్లాయిమెంట్ గైడెన్స్ బ్యూరో కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెంలో కూడా ఈ తరహా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రాంతీయ వృత్తి విద్యా సంబంధ శిక్షణ కేంద్రానికి 70 కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడించారు.
స్కిల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం కోటి మందికి శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. 2020 నాటికి మరో కోటి మందికి ఈ విధమైన శిక్షణను ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. భారతదేశంలో ఇప్పటి వరకు 562 జాబ్ మేళాలను నిర్వహించినట్టు చెబుతూ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో జాబ్‌మేళాలు నిర్వహిస్తామని తెలిపారు. యువతులకు ప్రత్యేకంగా జాబ్ మేళాలు ఏర్పాటు చేసి 14వేల మందికి ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. ఉద్యోగాలు ఇవ్వడంలో పారదర్శకతకు ఎన్‌సిఎస్ పోర్టల్ దోహదపడుతుందని అన్నారు.
మీడియా సలహాదారుగా స్టీవెన్‌సన్
ఉస్మానియా యూనివర్సిటీ మీడియా సలహాదారుగా జర్నలిజం శాఖాధిపతి ప్రొఫెసర్ కె స్టీవెన్‌సన్ నియమితులయ్యారు. ఆయన శనివారం నాడు బాధ్యతలు స్వీకరించారు.
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో టిబిఐ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో టిబిఐ (టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్) ఐదో బ్యాచ్ కార్యక్రమాన్ని యుజిసి సభ్యుడు ప్రొఫెసర్ జి గోపాలరెడ్డి ప్రారంభించారు. ఒక్కో బ్యాచ్‌కు ఆరు నెలల శిక్షణ ఇస్తామని టిబిఐ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ వి వెంకటరమణ చెప్పారు.
నేడు ఎడ్‌సెట్
రెండేళ్ల బిఇడి కోర్సులో ప్రవేశానికి ఎడ్‌సెట్‌ను ఆదివారం నాడు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 14 పట్టణాల్లో 137 కేంద్రాల్లో ఎడ్‌సెట్ నిర్వహిస్తున్నారు. 64వేల మందికి హాల్‌టిక్కెట్లు జారీ చేశామని సెట్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం చెప్పారు.