తెలంగాణ

భూసేకరణ చట్టాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: తెలంగణ ప్రభుత్వం కేంద్ర భూసేకరణ చట్టం 2013ను సవరించి తెలంగాణ భూసేకరణ చట్టం 2016ను తేవడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకటరాములవు దాఖలు చేశారు. రాష్ట్రప్రభుత్వం వెబ్‌సైట్‌లో సవరణల ఉత్తర్వులను ఉంచకుండా నేరుగా మే 31వ తేదీన జీవో 92ను జారీ చేసిందని ఆయన పిటిషన్‌లో ఆరోపించారు. చట్టం ప్రకారం ముసాయిదా మార్గదర్శకాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలన్నారు. ఈ చట్టం సవరణల తుది నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు.