తెలంగాణ

టెన్షన్.. టెన్షన్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: సినీ పరిశ్రమలో రోజుకో కొత్త పేరు.. కొత్త కోణం వెలుగులోకి వస్తుండటంతో టాలీవుడ్ ప్రతిష్ఠ మాదకద్రవ్యాల మత్తులో మంటగలిసిపోయింది. మద్యానికి, మత్తుపదార్థాలకు బానిసలైన వారి బతుకుల ఇతివృత్తంతో సినిమాలు తీస్తూ..సమాజ మార్పును కోరే సినీ ప్రముఖులే మద్యం, మత్తుపదార్థాలకు అలవాటుపడి డ్రగ్స్ రాకెట్‌లో కూరుకుపోవడంతో ప్రేక్షకాభిమానులు విస్తుపోతున్నారు. సినీ పరిశ్రమలోని అగ్ర దర్శక, నిర్మాత, నటీ నటులతోపాటు సంగీత దర్శకులు సహితం డ్రగ్స్‌కు అలవాటుపడడం విస్మయాన్ని కల్గిస్తోంది.
ప్రధాన నిందితుడు కెల్విన్, అనుచరుల కస్టడీ ముగిసిన తరువాత రెండో జాబితాలోని వారికి నోటీసులు జారీ చేయడంతోపాటు అరెస్టుల పర్వం మొదలయ్యే అవకాశం ఉంది. డ్రగ్ డీలర్లకు, ఇండస్ట్రీలోని ప్రముఖుల మధ్య వారధిగా ఓ అగ్రహీరో ఉన్నట్టు సమాచారం. సినీరంగంలో అగ్రశ్రేణి నటుడి కుమారుడొకరికి నోటీసులు పంపినట్లు సమాచారం. ప్రస్తుతం సినీరంగంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్న ప్రఖ్యాత సంగీత దర్శకుడు, అతని సోదరుడికి రెండో జాబితాలో నోటీసులివ్వవచ్చని సిట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వీరితో పాటు కొందరు సహాయ నటులకు కూడా సిట్ నుంచి నోటీసులు వెళ్లనున్నాయి. మూడు, నాలుగు రోజుల్లో ఈ రెండోలిస్టు విడుదలవుతుంది. ఇప్పటికే నోటీసులు అందుకున్న వారు ఈనెల 19నుంచి 26వరకు జరిగే సిట్ అధికారుల విచారణకు హాజరుకానున్నారు.