తెలంగాణ

ఉపాధికల్పనలో ఆదర్శంగా రాష్ట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: ఉపాధి కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా మారేలా ప్రయత్నిస్తున్నామని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. హైదరాబాద్ (హైటెక్స్) లోని నేషనల్ అకాడమీ ఫర్ కన్‌స్ట్రక్షన్‌లో శనివారం జరిగిన ‘అంతర్జాతీయ యువ నైపుణ్య దినోత్సవం’ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యువత తమకు వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. అంతర్జాతీయంగా పేరున్న సంస్థలు తెలంగాణవైపు వస్తున్నాయని, దాంతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయని తెలిపారు. 2022 వరకు 10 కోట్ల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించారు.
దీన్ దయాళ్ గ్రామీణ కౌశల్య యోజన పథకం కింద 18 వేల మంది యువతీయువకులకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి, ప్లేస్‌మెంట్ కల్పించామని మంత్రి గుర్తు చేశారు. గత ఏడాది నైపుణ్య శిక్షణ ఇవ్వడంలో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. ఈ అంశంలో ఈ సంవత్సరం జాతీయ స్థాయిలో మొదటిస్థానం పొందేందుకు అందరం కలిసి పనిచేయాలని పిలుపు ఇచ్చారు. ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రతి జిల్లాలోనూ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని మంత్రి వివరించారు. శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో నైపుణ్యం అభివృద్ధి చెందుతుందని ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈజిఎంఎం) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీతూ ప్రసాద్ పేర్కొన్నారు. గ్రామీణ యువతకు తగిన ప్రోత్సాహం ఇస్తున్నామని స్పష్టం చేశారు. పల్లె ప్రాంతాల్లోని యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తూ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని జాగృతి విద్యాసంస్థల చైర్మన్ ఎస్‌వి రావు తెలిపారు. ఈజిఎంఎం ఏజేన్సీల తరఫున జాగృతి పనిస్తోందని, ప్రభుత్వ సహకారం పూర్తిగా లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈజిఎంఎంలో శిక్షణ పొంది ఉపాధి లభించిన అభ్యర్థులు కొంత మంది మాట్లాడుతూ, ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తమకు ఈజిఎంఎం దిక్సూచిగా నిలిచిందన్నారు. నెలకు 10 వేల నుండి 35 వేల రూపాయల వరకు సంపాదించుకుంటున్నామని వెల్లడించారు.
ఈజిఎంఎం ద్వారా శిక్షణపొంది ఉపాధి అవకాశాలు లభించిన వెయ్యిమంది యువతీయువకుల విజయగాథలతో రూపొందించిన పుస్తకాన్ని మంత్రి జూపల్లి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. శిక్షణా కేంద్రాల నిర్వాహకులు, ఉపాధి కల్పించిన వివిధ సంస్థల ప్రతినిధులకు మంత్రి మెమొంటోలు అందించారు.

చిత్రం.. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘అంతర్జాతీయ యువ నైపుణ్య దినోత్సవం’లో పాల్గొని యువకుల విజయగాథల పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి జూపల్లి