తెలంగాణ

రెండు రోడ్లకు లైన్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: తరచూ సికింద్రాబాద్ నుంచి బోయిన్‌పల్లి, హకీంపేట వైపు ట్రాఫిక్ జామ్‌లతో సతమతమవుతున్న ప్రజలకు కేంద్ర రక్షణ శాఖ ఊరట కల్పించబోతున్నది. రెండు రోడ్డు ప్రాజెక్టులకు రక్షణ శాఖ లైన్ క్లియర్ చేసింది. ప్యారడైజ్ నుంచి బోయిన్‌పల్లి క్రాస్ రోడ్డు వరకు, సికింద్రాబాద్ నుంచి హకీంపేట ఎయిర్ ఫోర్స్ వరకూ రోడ్డు వెడల్పుకు వంద ఎకరాలు ఇచ్చేందుకు కేంద్ర రక్షణ శాఖ సుముఖత వ్యక్తం చేసింది. దీనికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం 500 ఎకరాలు ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
తాజాగా ఢిల్లీలో జరిగిన రక్షణ శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది. రక్షణ శాఖ కార్యదర్శి అధ్వర్యంలో జరిగిన సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి), రోడ్లు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బి) అధికారులు పాల్గొన్నారు. ఇకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నట్లు సికింద్రాబాద్‌లోని బైసన్ పోలో గ్రౌండ్ ఇచ్చే అంశం ఏదీ చర్చకు రాలేదని తెలుస్తోంది. బైసన్ గ్రౌండ్ స్థలాన్ని ఇస్తే అత్యాధునిక హంగులతో సచివాలయం నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆలోచన చేస్తున్న సంగతి తెలిసిందే.
నిత్యం ట్రాఫిక్ జామ్‌తో పరేషాన్ అవుతున్న ప్రజలకు రక్షణ శాఖ నిర్ణయం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. చిన్న రోడ్లు, అటు ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళే మార్గం, చుట్టు పక్కల బోయిన్‌పల్లి, అల్వాల్, సుచిత్ర వెళ్ళే మార్గాలన్నీ వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటూ, గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లతో బేజారెత్తిన ప్రజలకు 200 మీటర్ల వెడల్పైన రోడ్లు కాబోతున్నాయంటే సంతోషం ఉండదా. ప్యారడైజ్ సర్కిల్ నుంచి బోయిన్‌పల్లి క్రాస్ రోడ్డుకు వెళ్ళేందుకు నానా కష్టాలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు జిహెచ్‌ఎంసి ప్రతిపాదిత రోడ్డు వెడల్పునకు కేంద్ర రక్షణ శాఖ అంగీకరించడంతో బాలంరాయి పంప్ హౌస్, ఎంఇఎస్ పంప్ హౌస్, పాత బేగంపేట ఎయిర్ పోర్టు రోడ్డు (ప్రహరీ గోడ), తాడ్‌బండ్ జంక్షన్, అంబేద్కర్ విగ్రహం వరకూ రోడ్డు వెడల్పునకు జిహెచ్‌ఎంసి అధికారులు కేంద్ర రక్షణ శాఖ ఉన్నతాధికారుల ముందు ప్రతిపాదన పెట్టారు. అదేవిధంగా సికింద్రాబాద్ ఎస్‌పి రోడ్డు నుంచి హకీం పేట ఎయిర్ ఫోర్సు స్టేషన్ వరకూ రోడ్డు వెడల్పు చేసేందుకు ఎయిర్ ఫోర్సు క్వార్టర్లు, సికింద్రాబాద్ క్లబ్, ప్రైవేటు హౌసింగ్ కాలనీలు, లాల్ బజార్, తిరుమలగిరి రూట్లలో రోడ్డు వెడల్పు చేసేందుకు ప్రతిపాదనలు సమర్పించారు.