తెలంగాణ

అన్నదాతల అవస్థలు పట్టవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 16: సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకునే పేరిట ప్రభుత్వం గ్రామస్థాయి నుంచి ఏర్పాటు చేయతలపెట్టిన రైతు సమాఖ్య వ్యవస్థ ఫార్సు అని, అవి ఓటు బ్యాం కుగా ప్రభుత్వానికి ఉపయోగపడటం తప్ప రైతులకు చేసే ప్రయోజనం ఏమీ ఉండదని తెలంగాణ జెఎసి చైర్మెన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలు కార్పొరేట్ సంస్థలకు ఉపయోగకరంగా మారుతున్నాయే తప్ప రైతులకు ఎటువంటి ప్రయోజనం కలగటం లేదని అన్నారు. తెలంగాణ నవనిర్మాణ వేధిక ఆధ్వర్యంలో హరిత హోటల్‌లో ఏర్పాటుచేసిన వ్యవసాయ రంగం లో ఏర్పడిన సంక్షోభం- కారణాలు- పరిష్కార మార్గాలు అనే అంశంపై ఏర్పాటుచేసిన సదస్సు లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయరంగం ఎంతో కీలకపాత్ర పోషిస్తోందని, కానీ ప్రభుత్వాలు వ్యవసాయరంగాన్ని చిన్నచూపు చూస్తున్నాయని అన్నారు. దేశంలోని అత్యధిక జనాభా వ్యవసాయరంగంపై ఆధారపడి ఉన్నా ఈ రంగంలో ఎదురవుతున్న సాదకబాధకాలను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని చెప్పారు. వ్యవసాయరంగ ప్రాధాన్యత, రైతాంగ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా వ్యవసాయ పాలసీని రూపొందించాలని, ఫార్మర్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని చాలారోజుల నుంచి డిమాండ్ ఉన్నా ప్రభుత్వాలు ఖాత రు చేయటం లేదని విమర్శించారు. వ్యవసా యం చేస్తున్న రైతుల్లో 95శాతం మంది చిన్న, సన్నకారు రైతులని, వీరికి సకాలంలో రుణాలు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు అందక ఇబ్బందులు పడుతున్నారని, కష్టపడి పండించిన పంటలకు బహిరంగ మార్కెట్‌లో సరైన గిట్టుబాటు ధరలు లభించక ఆర్థికంగా నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వాలు స్వేచ్ఛా వ్యాపార విధానం కారణంగా కార్పొరేట్ సంస్థ లు విదేశాల నుంచి ఉత్పత్తులను ఇబ్బడిముబ్చడిగా దేశీయ మార్కెట్‌లోకి దింపటంతో స్వదేశీ ఉత్పత్తులకు సరైన ధరలు లభించక సంక్షోభం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేసారు. వ్యవసాయ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బిసిల సంఖ్య అధికమని, వీరి వద్ద భూమి ఎక్కువమటుకు అసైన్డ్, ఇనాం భూములని, అభివృద్ధి, పారీశ్రామికీకరణ, ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూసేకరణ పేరిట ప్రభుత్వం ఈ భూములను బలవంతగా లాక్కుంటోందని అన్నారు. తెలంగాణ వచ్చాక వ్యవసాయానికి ప్రోత్సాహం లభిస్తుందని, తమ బతుకులు బాగుపడతాయని రైతులు ఆశించినా ప్రయోజనం లేకుండా పోయిందని, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రైతుల పొట్టకొట్టే విధంగా తయారయిందని తెలిపారు. బిజెపి నాయకుడు వేణుగోపాలరెడ్డి మాట్లాడు తూ రైతుల సంక్షేమం తమ ప్రభుత్వ ధ్యేయం గా ముఖ్యమంత్రి, మంత్రులు గొప్పలు చెబుతున్నారని, కానీ గిట్టుబాటు ధర కోసం ఆందోళనలు చేస్తున్న రైతులపై లాఠీచార్జి చేయించటం, అరెస్టులు చేయించటం, కోర్టుల చుట్టూ తిప్పటమే రైతుల సంక్షేమమా అని ప్రశ్నించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాల కారణంగా గత రెండేళ్లుగా రాష్ట్రంలో రాష్ట్రంలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని విమర్శించా రు. సిపిఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, న్యూడెమోక్రసీ నాయకుడు అప్పారావు, కాకతీయ విశ్వవిద్యాలయ రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకటనారాయణ తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

చిత్రం.. సదస్సులో మాట్లాడుతున్న జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం