తెలంగాణ

అడ్వకేట్ జనరల్‌గా ప్రకాశ్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జనరల్‌గా సీనియర్ న్యాయవాది దేశాయి ప్రకాశ్‌రెడ్డిని (61) రాష్ట్రప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి (న్యాయ) వి. నిరంజన్ రావు పేరుతో సోమవారం జీఓ (ఆర్‌టి నెంబర్ 453) జారీ అయింది. మహబూబ్‌నగర్ జిల్లా అమరచింత (ప్రస్తుతం వనపర్తి జిల్లా) కు చెందిన ప్రకాశ్‌రెడ్డి సొంత గ్రామంలో హైస్కూల్‌వరకు చదివారు. ఉస్మానియా లా కాలేజీ నుండి ఎల్‌ఎల్‌బి చేశారు. 1977 లో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ ప్రారంభించిన ప్రకాశ్‌రెడ్డి సీనియర్ల వద్ద కొంతకాలం పనిచేశారు. 1986 నుండి 1990 వరకు స్వతంత్రంగా హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా 1990 నుండి 98 వరకు పనిచేశారు. 1998 లో ఆయనను ఉమ్మడి హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా టిడిపి ప్రభుత్వం నియమించింది. ఈ పోస్టులో 2004 వరకు కొనసాగారు. 2004లో ప్రభుత్వం మారడంతో అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోస్టుకు రాజీనామా చేశారు. ఆ తర్వాత మళ్లీ హైకోర్టులోనే ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రకాశ్‌రెడ్డి తండ్రి మురళీధర్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా అమరచింత నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా కొంతకాలం పనిచేశారు. ప్రకాశ్‌రెడ్డి మృదుస్వభావిగా పేరుతెచ్చుకున్నారు.