తెలంగాణ

నాకు ఎవరూ లేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఇంటి నుంచి పారిపోయి ముంబయిలో వెళ్లిన టెన్త్ విద్యార్థిని పూర్ణిమసాయి తల్లిదండ్రుల వెంట వచ్చేందుకు నిరాకరించింది. గత నెల 7న స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పి ముంబయికి వెళ్లిన పూర్ణిమను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే.
40 రోజుల నుంచి కనిపించకుండా పోయిన తమ కూతురిని వెంట తీసుకొద్దామని ఎంతో ఆతృతతో ముంబయి వెళ్లిన తల్లిదండ్రులకు..నాకు తల్లిదండ్రులు లేరంటూ పూర్ణిమ అలక వారికి షాక్‌కు గురిచేసింది. పూర్ణిమను తీసుకు వచ్చేందుకు వెళ్లిన పోలీస్ బృందం ఎట్టకేలకు పూర్ణిమకు సర్దిచెప్పి ఆమెను సోమవారం సాయంత్రం ముంబయి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారని, మంగళవారం పూర్ణిమను కోర్టులో హాజరుపరుస్తామని ఏసిపి భుజంగరావు తెలిపారు.