తెలంగాణ

ఐదేళ్లలో 230 కోట్ల మొక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: తెలంగాణ రాష్ట్రంలో ఐదేళ్ల కాలంలో 230 మొక్కలు నాటాలని నిర్ణయించామని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. హైదరాబాద్ (నల్లగొండ క్రాస్‌రోడ్డు) లోని వికలాంగుల పాఠశాలలో సోమవారం ఆయన హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హరిత తెలంగాణ సాధించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రకృతి సహకరించడంతో గత రెండేళ్ల నుండి హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో అటవీవిస్తీర్ణం ప్రస్తుతం 24 శాతం ఉందని, 33 శాతం చేరాలన్నదే దే తమ ఉద్దేశమన్నారు. విద్యార్థులు, ప్రజలంతా హరితహారంలో పాల్గొనాలని, విరివిగా మొక్కలు నాటాలని పిలుపు ఇచ్చారు.