తెలంగాణ

కోదండరామ్ అరెస్టు దారుణం: జెఎసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: కొండ పోచమ్మ రిజర్వాయర్ నిర్మాణం పేరిట పేదల నుంచి ప్రభుత్వం బలవంతంగా భూములు సేకరించడాన్ని అడ్డుకోవడానికి వెళ్ళిన టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్‌ను పోలీసులు అకారణంగా అరెస్టు చేశారని టి.జెఎసి విమర్శించింది. ప్రొఫెసర్ కోదండరామ్ అరెస్టుతో నాంపల్లిలోని కార్యాలయంలో టి.జెఎసి అత్యవసరంగా సమావేశమై చర్చించింది. ప్రొఫెసర్ కోదండరామ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఈ మేరకు తీర్మానం చేసింది. కొండ పోచమ్మ రిజర్వాయర్ పేరిట ప్రభుత్వం బలవంతంగా చేపట్టిన భూసేకరణను వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ మరో తీర్మానం చేసినట్లు టి.జెఎసి నాయకుడు రఘు తెలిపారు. వచ్చే నెల 21న ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై సదస్సు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. వచ్చే నెల 22న ఢిల్లీలో జంతర్-మంతర్ వద్ద ‘సేవ్ ధర్నా చౌక్’ నినాదంతో ధర్నా నిర్వహిస్తామని ఆయన తెలిపారు.