తెలంగాణ

కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై ప్రభుత్వ ప్రోద్బలంతో పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని డిసిసి అధ్యక్షులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం గాంధీ భవన్‌లో నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బిక్షమయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు డిసిసి అధ్యక్షులు, టి.పిసిసి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అహింసా పద్ధతిలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వరంగల్ (పాత) జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టి అణగ దొక్కాలన్న టిఆర్‌ఎస్ ప్రయత్నిస్తున్నదని సమావేశంలో పాల్గొన్న నాయకులు విమర్శించారు. రాజేందర్ రెడ్డి కుమారుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడాన్ని, పుత్రశోకంతో ఉన్న ఆయనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని వారు విమర్శించారు. నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసినా, అక్రమ కేసులు పెట్టినా సహించేది లేదన్నారు. త్వరలో డిజిపిని కలిసి విన్నవించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
టిఆర్‌ఎస్‌పై భగ్గుమన్న జానారెడ్డి
వరంగల్ డిసిసి అధ్యక్షుడు రాజేందర్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని సిఎల్‌పి నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ విమర్శించారు. హత్యతో సంబంధం లేకపోయినా కేసు పెట్టారని ఆయన అన్నారు. హత్య చేసిన వారు ఒప్పుకున్నా, రాజేందర్‌పై ఎలా కేసు పెడతారని ఆయన ప్రశ్నించారు.