తెలంగాణ

వెంకయ్యకు అభినందనల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: భారత ఉప రాష్టప్రతి అభ్యర్థిగా ఎం వెంకయ్యనాయుడును బిజెపి పార్లమెంటరీ పార్టీ నిర్ణయం తీసుకోవడంపై ఆ పార్టీ నేతలు అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ సరైన నిర్ణయం తీసుకున్నారని, వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వం తెలుగు జాతికే గర్వకారణమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. సమస్య పరిష్కర్తగా ఆయన వ్యవహరించారని, పార్లమెంటును చాకచక్యంగా నడపడంలో కూడా ఆయన స్ఫూర్తిగా పనిచేశారని పేర్కొన్నారు. సామాన్య కార్యకర్తకు ఉన్నత పదవి దక్కే అవకాశం బిజెపిలో మాత్రమే ఉంటుందని మరోసారి తేటతెల్లం అయిందని అన్నారు. వెంకయ్యనాయుడు భవిష్యత్‌లో దేశానికి మరిన్నిసేవలు అందించే అవకాశం దక్కిందని ఆయన చెప్పారు. పరిచయం అక్కర్లేని నేత వెంకయ్యనాయుడు అని బిజెపి శాసనసభాపక్ష నేత జి కిషన్ రెడ్డి చెప్పారు. వాగ్దాటికి మారుపేరని, సుదీర్ఘ రాజకీయ జీవితంలో వెంకయ్య అనేక హోదాల్లో పనిచేశారని అన్నారు. అత్యున్నత పదవిని అలంకరించబోవడం తెలుగు వారి అదృష్టమని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డి, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 2002 జూలై లో బిజెపి జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారని, ప్రస్తుతం మోదీ కేబినెట్‌లో సమచార, ప్రసార శాఖలతో పాటు పట్టణాభివృద్ధి మంత్రిగా తెలుగురాష్ట్రాలకు విశేష సేవలు అందిస్తున్నారని వారు తెలిపారు. రాజకీయాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వెంకయ్య సామాజిక కార్యక్రమాల్లో సైతం చురుకుగా పాల్గొంటున్నారని చెప్పారు. పార్టీకి చెందిన వందలాది నేతలు ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉప రాష్టప్రతి అభ్యర్థిగా వెంకయ్య ఎంపిక తెలుగు జాతికి గర్వకారణమని వారు పేర్కొన్నారు.
ఢిల్లీకి ముఖ్యనేతలు
వెంకయ్యనాయుడు నామినేషన్ సందర్భంగా తెలంగాణ నుండి నాయకులు అంతా ఢిల్లీ వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఇటు వెంకయ్యనాయుడును, అటు రాష్టప్రతి అభ్యర్థి రామనాధ్ కోవింద్‌ను కూడా కలిసి వారు అభినందనలు తెలుపుతారని డాక్టర్ కె లక్ష్మణ్ తెలిపారు.