తెలంగాణ

రెండురోజుల పాటు భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే రెండు రోజుల పాటు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. బంగాళాఖాతంలో నిన్న ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని ఐఎండి హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ (ఇంజార్జి) వైకె రెడ్డి తెలిపారు. ఈ కారణంగా నైరుతీరుతుపవనాలు బలంగా మారాయని, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారి దక్షిణ దిశవైపు కదులుతోందని, దీని ప్రభావం వల్ల తెలంగాణతో పాటు కోస్తాంధ్ర, ఒడిశా తదితర రాష్ట్రాల్లో బలంగా ఉంటుందని, ఈ రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజుల పాటు భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. గత 24 గంటల్లో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. కొత్తగూడెం (వరంగల్)లో తొమ్మిది సెంటీమీటర్లు, కొయిడా, పాల్వంచ, ములకలపల్లి, ఎంకూరు (ఖమ్మం),నల్లబెల్లి (వరంగల్)లలో ఏడేసి సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి, వికారాబాద్ తదితర జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి.