తెలంగాణ

డిజిటల్ లిటరసీకి సంపూర్ణ సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ లిటరసీ (డిజిథాన్) కార్యక్రమానికి తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని తెలంగాణ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిఐటిఏ) దక్షిణాఫ్రికా చాప్టర్ ప్రకటించింది. దక్షిణాఫ్రికాలోని జోహనె్నస్‌బర్గ్ వెళ్లిన తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌ను కలిసిన టిఐటిఏ దక్షిణాఫ్రికా చాప్టర్ ప్రతినిధులు డిజిథాన్‌కు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. డిజిటల్ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల ఫలితాలను తెలంగాణ ప్రజలకు అందించేందుకు గాను టిఐటిఏ చేస్తున్న కృషిని ఆయన అభినందించారని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్‌కుమార్ మక్తాలా ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే తెలంగాణలో 46 గ్రామాలను ఎన్‌ఆర్‌ఐలు దత్తత తీసుకున్నారని, డిజిటల్ లిటరసీలో పాల్గొనేందుకు ఎంతోమంది ముందుకు వచ్చారని ఈ సందర్భంగా టిఐటిఏ దక్షిణాఫ్రికా బృందానికి నాయకత్వం వహించిన వెల్తాపు భూమయ్య తెలిపారు. ఈ బృందంలో సౌత్‌ఆఫ్రికాలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ కె.జె.శ్రీనివాస్, వై.వెంకటరెడ్డి, పొల్లూరి కిషోర్, హరీశ్ రంగ ప్రభృతులు ఉన్నారు.