తెలంగాణ
కోదండరామ్ అరెస్టును ఖండించిన చాడ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 18 July 2017
హైదరాబాద్, జూలై 17: తెలంగాణ జెఏసి చైర్మన్ కోదండరామ్‌ను అరెస్టు చేయడాన్ని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం, బైలాంపూర్ గ్రామంలో కొండ పోచమ్మ జలాశయ నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులతో టిజెఎస్సి చైర్మన్ కోదండరామ్ సోమవారం సమావేశమైనప్పుడు పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను దేశంలో ఏ ప్రాంతంలోనైనా సంచరించే, నివశించే హక్కులను నేటి పాలకులు కాలరాయడం ప్రస్వామ్య మనుగడకే ప్రమాదమని అన్నారు.