తెలంగాణ

కోవింద్ మంచి మెజార్టీతో గెలుస్తారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: రాష్టప్రతి ఎన్నికల్లో ఎన్‌డిఎ అభ్యర్ధి రామనాధ్ కోవింద్ భారీ మెజారిటీతో గెలుస్తారని బిజెఎల్పీ నేత జి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్‌లు పేర్కొన్నారు. రాష్టప్రతి ఎన్నిక అనంతరం వారు వేర్వేరుగా మాట్లాడుతూ రాష్టప్రతి ఎన్నికల్లో అన్ని వర్గాలూ సంపూర్ణ మద్దతు ప్రకటించాయని అన్నారు. అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా కోవింద్‌కు అండగా నిలవాలని తాము కోరామని అన్నారు. ఓడిపోతామని తేలిన తర్వాత కాంగ్రెస్ నేతలు దిగజారుడు రాజకీయాలు చేశారని, ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు తమకు ఓట్లు వేస్తారంటూ అబద్దాలు మాట్లాడుతున్నారని అన్నారు. రాజ్యాంగం ప్రకారం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో రామనాధ్ అన్ని రంగాల్లో సమర్ధుడని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.