తెలంగాణ

కొంపల్లిలో యువతిపై యాసిడ్ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ (జీడిమెట్ల), జూలై 17: ఓ యువతి పై యాసిడ్ దాడికి పాల్పడిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. దత్తాత్రేయ నగర్‌లో నివాసముండే ఖబీర బేగం (22), సుభాష్‌నగర్‌లో నివాసముండే ప్రదీప్ జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో పనిచేస్తారు. అయితే, సోమవారం రాత్రి ప్రదీప్ యాసిడ్‌తో ఖబీర బేగం నివాసానికి వెళ్లి మాట్లాడాలని బయటికి పిలిచి యాసిడ్ దాడి చేసి పరారయ్యాడు. గాయాలకు గురైన ఖబీర బేగమ్‌ను వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఖబీర బేగమ్ ముఖం పై, చేతులకు గాయాలయ్యాయి. వీరిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.