తెలంగాణ

తగ్గిన హింస... పెరిగిన లొంగుబాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: గత రెండు దశాబ్దాల కాలంలో మావోయిస్టుల హింసాకాండకు 12వేల మంది బలయ్యారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2,700 మంది భద్రతా సిబ్బంది, 9,300 మంది సామాన్యులను ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు హతమార్చినట్టు కేంద్ర గణాంకాలు పేర్కొన్నాయి. అయితే గత మూడేళ్లలో మావోల హింస 25 శాతం తగ్గింది. 2011-14తో పోలిస్తే.. 2014-17 మధ్య కాలంలో పోలీస్ సిబ్బంది మరణాలు 42 శాతం తగ్గినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తన గణాంకాల్లో పేర్కొంది. కాగా మావోయిస్టులు ఈ ఏడాది ఏప్రిల్ 24న 25 మంది సీఆర్‌పిఎఫ్ సిబ్బందిని బలిగొన్న విషయం తెలిసిందే. 2010 ఏప్రిల్ తరువాత మావోయిస్టుల అతిపెద్ద హింసాత్మక ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో జరిగిన సంగతి తెలిసిందే.
మావోయిస్టుల ఏరివేత సిబ్బంది 65శాతానికి పెరుగగా, లొంగిపోతున్న మావోల శాతం 185శాతానికి పెరిగింది. ప్రస్తుతం 90 శాతం మావోయిస్ట కార్యకలాపాలు దేశంలోని 35 జిల్లాలకే పరిమితమయ్యాయని హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే 10 రాష్ట్రాల్లోని 68 జిల్లాల్లో వీరి ఉనికి ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా. వామపక్ష తీవ్రవాదం తగ్గించేందుకు కేంద్రం జాతీయ విధానం, కార్యచర్ణ ప్రణాళికను ప్రారంభించింది. ఇందులో భాగంగానే 307 పోలీస్ స్టేషన్లు నెలకొల్పారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 1,391 కిలోమీటర్ల మేరకు రహదారులు నిర్మించారు. 5,412 కిలోమీటర్ల మేర అదనంగా రహదారులు నిర్మించేందుకు రూ. 11,725 కోట్లు కేటాయించారు. 2,187 మొబైల్ టవర్లు ప్రారంభించగా కొత్తగా 2,882 టవర్లు నిర్మిస్తున్నారు. 358 బ్యాంకు శాఖలు, 752 ఏటిఎంలు, 1,789 తపాలా కార్యాలయాలు ప్రారంభించారు. మావోల ఉనికి ఉన్న 35 జిల్లాల్లో సమ్మిళిత ఆర్థికాభివృద్ధిలో భాగం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తోంది.