తెలంగాణ

సాగర..మధనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 17: వర్షాలు లేక నాగార్జున సాగర్ జలాశయంలో నీటి మట్టం రోజురోజుకు మరింత లోతుకు పడిపోతుండటంతో హైద్రాబాద్, నల్లగొండ జిల్లాలకు కృష్ణా మంచినీటి సరఫరా సమస్యలను అధిగమించేందుకు హైద్రాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, ఇరిగేషన్ శాఖలు మరో భగీరథ ప్రయత్నం ఆరంభించాయి. ఏఎమ్మార్పీ ఎత్తిపోతల పుట్టంగడి అత్యవసర మోటార్లకు, ప్రధాన మోటార్లకు నీరందించేందుకు పుట్టంగడి జీరో పాయింట్ వద్ద అప్రోచ్ కెనాల్‌ను మరింత లోతుకు నీటిలో పొడిగించేందుకు తవ్వకం పనులకు సోమవారం ఏర్పాట్లు చేశారు. నేటి నుండి నీటిలో కాలువ తవ్వకం పనులు ఆరంభించనున్నారు. నీటిలో సైతం తవ్వకాలు సాగించేందుకు ప్రొక్లెయినర్ మిషన్‌ను నీళ్లలోకి తీసుకెళ్లేందుకు ఏడు ఫాంటోన్ బాక్సులను జతచేస్తూ బల్లకట్టును ఏర్పాటు చేసే పనులు సోమవారం పూర్తి చేశారు. ఈ బల్లకట్టుపై ప్రొక్లెయినర్‌ను పెట్టి నీటిలో అప్రోచ్ కెనాల్‌ను కిలోమీటర్ మేరకు తవ్వేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నేటి నుండి త్రవ్వకం పనులు చేపడతారు. ఆరు నుండి ఏడు ఫీట్ల లోతు, 15 ఫీట్ల వెడల్పుతో అప్రోచ్ కెనాల్‌ను పొడిగిస్తారు. మూడున్నర కోట్లతో తవ్వాల్సిన ఈ కాలువ పనులను కనీసంగా 25 రోజుల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రెండు మోటార్లను నడిపించేందుకే అప్రోచ్ కెనాల్ పొడిగింపు
సాగర్ జలాశయం నీళ్లలోకి అప్రోచ్ కెనాల్ పొడిగించడం ద్వారా 10 అత్యవసర మోటార్ల సహాయంతో పుట్టంగడి రెండు ప్రధాన మోటార్లను నడిపించి రోజుకు 800 క్యూసెక్కుల నీటిని ఎకెబిఆర్‌కు అందించి హైద్రాబాద్‌కు, నల్లగొండకు తాగునీటి సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం అప్రోచ్ కెనాల్‌కు అందుతున్న అరకొర నీటితో ఎనిమిది అత్యవసర మోటార్లతో కేవలం 680 వరకు మాత్రమే నీటి సరఫరా సాధ్యమవుతుంది. దీంతో పుట్టంగడి సిస్టర్న్ రెండు ప్రధాన మోటార్లలో మూడుగంటలకు ఒకటి చొప్పున నడిపిస్తూ 680 క్యూసెక్కులను మాత్రమే ఎకెబిఆర్‌కు అందిస్తున్నారు. ఇందులో హైద్రాబాద్‌కు యధావిధిగా 525 క్యూసెక్కులు సరఫరా చేస్తుండగా తాజాగా నల్లగొండ ఉదయ సముద్రంకు ఎకెబిఆర్ నుండి 600 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. ఉదయ సముద్రానికి 1800 క్యూసెక్కులను విడుదల చేయనున్నారు. ఉదయ సముద్రంకు నీటి విడుదలతో ఏకెబిఆర్ రిజర్వాయర్ ఖాళీ అవుతుండటంతో హైదరాబాద్‌కు నీటి కొరత ఏర్పడకుండా వెంటనే ఏకెబిఆర్ నింపేందుకు రెండు ప్రధాన మోటార్లు నడిపించేందుకు కావాల్సిన నీటిని అందించేందుకు అప్రోచ్ కెనాల్ పొడిగింపు ఉపకరించనుంది.
ప్రస్తుతం సాగర్‌లో కనీస నీటి మట్టం 510 అడుగులకు దిగువగా 501.30 అడుగులుగా ఉంది. శ్రీశైలం నుండి ఏపి, తెలంగాణకు ఒక్కో టిఎంసి చొప్పున రెండు టిఎంసిలను సాగర్‌కు విడుదల చేస్తున్నారు. దీంతో సోమవారం సాగర్‌కు ఇన్‌ఫ్లో 8,812 క్యూసెక్కులుగా ఉండగా అవుట్‌ఫ్లో సాగర్ నుండి ఎస్‌ఎల్‌బిసి (ఏఎమ్మార్పీ)కి 551 క్యూసెక్కులుగా ఉంది.